Star Health's Data Leak: భారత్‌లో ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్టార్ హెల్త్’ కంపెనీ నుంచి కస్టమర్ల డేటా భారీ స్థాయిలో లీక్ (data leaked) కావడం ఆందోళన కలిగిస్తోంది.ఇందులో కస్టమర్ల మెడికల్ రిపోర్టులు, సున్నితమైన సమాచారం కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
టెలిగ్రామ్‌లోని (Telegram) చాట్‌బాట్స్ ద్వారా స్టార్ హెల్త్ సమాచారం అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ద్వారా చాట్‌బాట్ సృష్టికర్త ఈ విషయం మీడియాకు తెలియజేయడంతో, మిలియన్ల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయానికి ఉంచినట్లు (medical reports sold via Telegram) వెల్లడైంది.
డేటా చోరీపై స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్స్యూరెన్స్ సంస్థ స్పందించింది. అనధికార డేటా యాక్సెస్‌కు సంబంధించి స్థానిక అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది. ఈ విషయంలో రాజీ లేదని.. సున్నితమైన కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని స్పష్టంచేసింది.