Tecno Spark 20C Smartphone: చైనీస్ టెక్ దిగ్గజం టెక్నో తాజాగా ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. టెక్నో స్పార్క్ 20సి పేరుతో విడుదలయిన ఈ స్మార్ట్‌ఫోన్ 8 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభించనుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెరుగైన ఫీచర్లే ఉన్నాయి. దీని పెద్దని డిస్‌ప్లే మంచి టచ్ రెస్పాన్స్‌ను అందిస్తుంది. అలాగే శక్తివంతమైన వెనుక కెమెరా, దీర్ఘకాలం ఉండే బ్యాటరీతో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్‌లను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ స్టోరేజ్ పరంగా ఏకైక 8GB మరియు 128GB కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. అయితే, కలర్స్ పరంగా ఆల్పెంగ్లో గోల్డ్, గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ మరియు మ్యాజిక్ స్కిన్ గ్రీన్ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇంకా టెక్నో స్పార్క్ 20సి స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టాకోర్ మీడియాటెక్ Helio G36 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ AI క్వాడ్ పిక్సెల్ డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,999 కాగా, ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా దీనిపై రూ. 1000 డిస్కౌంట్ అందిస్తున్నారు. కాబట్టి వినియోగదారులు దీనిని రూ. 7,999/- ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే. Tecno Spark 20C స్మార్ట్‌ఫోన్ మార్చి 5, 2024 నుండి అమెజాన్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.