Representational Image (Photo Credits: Pixabay)

ఎక్కువమంది వీడియో కాల్ లో జాయిన్ కావాలనుకునే వారికి టెలిగ్రామ్‌ కొత్త అప్‌డేట్‌ తెచ్చింది. ఈ తాజా అప్‌డేట్‌తో యూజర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఫీచర్ ప్రకారం తాజాగా ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ (Telegram Video Call) మాట్లాడుకునే అవకాశాన్ని టెలిగ్రాం కల్పించింది. దీంతో పాటు వీడియోలను షేర్‌ చేసేలా ఫీచర్‌ ను అప్‌డేట్‌ చేసింది.

అలాగే యూజర్లందరు ఒకే సారి గ్రూప్‌కాల్‌ లో యాడ్‌ అయ్యే వరకు పరిమితిని పెంచుతూనే ఉండాలని టెలిగ్రామ్‌ తెలిపింది.1000 మంది వీడియో కాల్ (1,000 People Join a Video Call)మాట్లాడుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్‌ వల్ల ఆన్‌లైన్ క్లాసులు, మీటింగ్స్‌లో పాల్గొనే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటుగా టెలిగ్రామ్ (Telegram) తన వీడియో షేరింగ్‌ ఫీచర్‌ని అప్‌డేట్ చేసింది. మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని ట్యాప్‌ చేస్తే వీడియో రికార్డ్‌ అవుతుంది. ఆ రికార‍్డైన వీడియోలను మీ స‍్నేహితులకు షేర్‌ చేసుకోవచ్చు.

వయసు మళ్లిన ధనవంతులు వాడే డేటింగ్ యాప్స్‌ బ్యాన్, అమ్మాయిలతో సుఖం కోసం ఉపయోగించే షుగర్‌ డాడీ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన గూగుల్‌ ప్లేస్టోర్‌

ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా యూజర్లు వాట్సాప్‌కు దూరం అవుతున్నారు. అదే సమయంలో ప్రత్యామ్నయంగా టెలిగ్రామ్‌ యాప్‌ను వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో టెలిగ్రాం వాట్సాప్‌తో పోటీ పడడంతో పాటు యూజర్లను ఆకట్టుకునేలా సరి కొత్త కొత్త అప్‌డేట్‌లతో దూసుకుపోతుంది.