Vivo V30 Series : Photo- Vivo India

Vivo V30 Series: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ vivo భారత మార్కెట్లో తమ V-సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. గురువారం వివో V30 పేరుతో సరికొత్త  ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను విడుదల చేసింది. ఇందులో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి, మొదటిది స్టాండర్డ్ మోడల్ Vivo V30 కాగా, రెండవది Vivo V30 Pro. ఈ రెండు డైనమిక్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభమై, రూ. 47 వేల వరకు ఉన్నాయి.

ఇవి చాలా ఖరీదైన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌లు కాబట్టి వీటిలో అన్ని రకాల హైఎండ్ ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా V30 సిరీస్ అత్యాధునిక కెమెరా సాంకేతికత, నాజూకైన డిజైన్‌తో వచ్చాయి.  V30 సిరీస్ ఫోన్‌లు 2024లో భారత మార్కెట్లో లభించే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌లు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో vivo స్టూడియో క్వాలిటీ ఆరా లైట్ టెక్నాలజీ ద్వారా ఆధారితమైన 50MP VCS ప్రధాన కెమెరాతో ఉంటాయి. అలాగే రెండు మోడళ్లలోనూ ముందు, వెనుక కెమెరాల నుండి 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు. వీటిలోని ZEISS టెక్నాలజీ కలిగిన కెమెరాలు ప్రొఫెషనల్-గ్రేడ్ ఇమేజింగ్ నాణ్యతను అందజేస్తాయి.  సరిపడా స్టోరేజ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లు కనిష్టంగా 128GB, అలాగే గరిష్టంగా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి. రెండూ కూడా రెండూ సబ్-6 5G కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి.

సరికొత్త Vivo V30 మరియు Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్‌లలో ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయో ఈ కింద పరిశీలించండి.

Vivo V30 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
  • 8GB/ 12GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP +50MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 50MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

బేస్ మోడల్ Vivo V30 అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ అనే మూడు కలర్ షేడ్‌లలో లభిస్తుంది. అలాగే ఇది మూడు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ధరలు: 8GB + 128GB రూ. 33,999, 8GB + 256GB రూ. 35,999, మరియు 12GB + 512GB రూ. 37,999.

Vivo V30 Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
  • 8GB/ 12GB RAM, 256GB/512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 8200 SoC ప్రాసెసర్
  • వెనకవైపు 50MP +50MP+50MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 50MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Vivo V30 Pro అండమాన్ బ్లూ , క్లాసిక్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఇది రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా 8GB + 256GB వేరియంట్ కోసం 41,999, 12GB + 512GB వేరియంట్ రూ. 46,999.

ఈ మోడల్స్ కోసం ప్రీ-బుకింగ్ మార్చి 7 నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తిగల వినియోగదారులు Flipkart, Vivo ఇండియా ఇ-స్టోర్ మరియు ఇతర అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా మార్చి 14 నుండి ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.