
Vivo Y100t Smartphone: వివో కంపెనీ తమ బ్రాండ్‌లోని Y సిరీస్‌ను మరింత విస్తరిస్తూ వరుసహ్యాండ్‌సెట్లను విడుదల చేస్తుంది. కొత్తగా ఈ సిరీస్‌లో Vivo Y100tని ప్రవేశపెట్టింది. ఇది ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి మీరు గేమర్ అయినా, ఫోటోగ్రఫీ ఔత్సాహికులైనా లేదా రోజువారీ పనుల కోసం ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నట్లయితే వివో Y100t పరిగణించవచ్చు. సగటు వినియోగదారుడు కోరుకునే ఫీచర్లు అన్నీ ఇందులో లభిస్తాయి. శక్తివంతమైన పనితీరు, సొగసైన డిజైన్, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్, సరిపడా స్టోరేజ్ సామర్థ్యం వంటివి వివో Y100t లో ముఖ్యాంశాలుగా చెప్పవచ్చు.
ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా Vivo Y100t మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే ఫార్ మౌంటైన్ గ్రీన్, మూన్ షాడో బ్లాక్ మరియు స్నోవీ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో, ఆ వివరాలను మరోసారి ఈ కింద పరిశీలించండి.
Vivo Y100t 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు,స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన6.64అంగుళాల LCD ఫుల్ HD+ డిస్‌ప్లే
- 8GB/12GB RAM, 256GB/512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్
- వెనకవైపు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 120W SuperVOOC ఛార్జింగ్
కనెక్టివిటీ కోసం.. 5G, 4G LTE, WiFi 6, బ్లూటూత్ 5.3, NFC, GPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కలిగి ఉంది.
ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో విడుదలైంది, ధరలను పరిశీలిస్తే.. Vivo Y100t బేస్ వేరియంట్ 8GB RAM +256GB స్టోరేజ్ కోసం ధర CNY 1,449 (దాదాపు రూ. 17,560)
12GB RAM +256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం ధర CNY 1,649 (దాదాపు రూ. 19,310)
12GB+512GB కోసం ధర CNY 1,849 (దాదాపు రూ. 21,660) గా ఉంది.
ఆసక్తి కలిగిన వినియోగదారులు ఫిబ్రవరి 28 నుండి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.