WhatsApp (Photo Credits: Pixabay)

New Delhi, June 02: ప్రముఖ మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. విస్తారమైన యూజర్ బేస్ కోసం ప్లాట్‌ఫారమ్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్, రిపోర్ట్, బ్లాక్ ఫీచర్‌లను అందించడం ద్వారా యూజర్ భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సెక్యూరిటీ చర్యలతో పాటు, వాట్సాప్ యూజర్లు సమర్పించిన అన్ని నివేదికలను రివ్యూ చేస్తోంది. కంపెనీ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించే అకౌంట్లపై తగిన చర్య తీసుకుంటుంది. స్పామ్, స్కామ్‌లు, వాట్సాప్ యూజర్లు భద్రతకు హాని కలిగించే ఏదైనా ప్రవర్తన వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. పారదర్శకతను కొనసాగించేందుకు వాట్సాప్ ఫలితాలను యూజర్ భద్రత నెలవారీ నివేదికలో కూడా ప్రచురిస్తుంది. ఏప్రిల్ 2023కి రిలీజ్ చేసిన లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. 74 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను నిషేధించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 4(1)(డి) రూల్ 3A(7) ప్రకారం.. వాట్సాప్ రిపోర్టును రిలీజ్ చేసింది. బ్యాన్ అయిన అనేక భారతీయ అకౌంట్లను రివీల్ చేస్తోంది. యూజర్ల ఫిర్యాదులు, ఇతర సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. వాట్సాప్‌లో ఏప్రిల్ 2023లో 74 లక్షల భారతీయ అకౌంట్లను నిషేధించింది (Whats app Banned). ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30, 2023 కాల వ్యవధిలో, వాట్సాప్ 7,452,500 కన్నా ఎక్కువ మంది భారతీయ యూజర్లపై బ్యాన్ విధించింది. ఈ సంఖ్యలో దాదాపుగా 2,469,700 అకౌంట్లు ఎలాంటి ముందస్తు యూజర్ ఫిర్యాదులు లేకుండానే వాట్సాప్ ద్వారా ముందస్తుగా బ్యాన్ అయ్యాయి.

Meta Layoffs: 6 వేల మంది ఉద్యోగులను తీసివేసిన ఫేస్‌బుక్ మెటా, ముందు ముందు లేఆప్స్ ఇంకా కొనసాగుతాయని తెలిపిన మెటా ఫౌండర్, CEO మార్క్ జుకర్‌బర్గ్ 

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌కు 4,377 ఫిర్యాదుల నివేదికలు కూడా అందాయి. వాట్సాప్ నుంచి 234 అకౌంట్లపై చర్యలు తీసుకుంది. ముఖ్యంగా, మార్చి 2023 గణాంకాలతో పోలిస్తే.. ఏప్రిల్ 2023 సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంటుంది. మార్చిలో వాట్సాప్ 47 లక్షల భారతీయ అకౌంట్లను నిషేధించింది. వాట్సాప్ (Whats app Banned) ప్లాట్‌ఫారమ్ యూజర్ల నుంచి నివేదికలను స్వీకరించడం కొనసాగిస్తోంది. ఏప్రిల్‌లో నివేదికల పెరుగుదల కొనసాగుతున్న వాట్సాప్ స్కామ్‌లకు కారణమని చెప్పవచ్చు. చాలా మంది యూజర్లు వివిధ నంబర్ల నుంచి స్పామ్ మెసేజ్‌లు, కాల్‌లను స్వీకరించినట్లు నివేదించింది. యూజర్ భద్రతను నిర్ధారించేందుకు కృత్రిమ మేధస్సు, డేటా సైంటిస్టులు, నిపుణులలో పెట్టుబడులను అందిస్తుంది.

Alibaba to Hire 15,000 People: ఆలీబాబా కంపెనీలో ఉద్యోగాల జాతర, 15 వేల మందిని ఈ ఏడాది నియమించుకోనున్నట్లు తెలిపిన చైనా దిగ్గజం 

వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసుల్లో దుర్వినియోగాన్ని నిరోధించడంలో అగ్రగామిగా ఉంది. వాట్సాప్ ఏళ్ల తరబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా సైంటిస్టులు, నిపుణులపై పెట్టుబడి పెడుతోంది. ఐటీ నియమాలు 2021 ప్రకారం.. ఏప్రిల్ 2023 నెల రిపోర్టులో వినియోగదారు-భద్రతా నివేదికలో వాట్సాప్ ద్వారా స్వీకరించిన యూజర్ ఫిర్యాదులు, సంబంధిత చర్యల వివరాలు ఉన్నాయి. లేటెస్ట్ నెలవారీ రిపోర్టులో వాట్సాప్ ఏప్రిల్ నెలలో 7.4 మిలియన్లకు పైగా అకౌంట్లను నిషేధించింది. యూజర్ల నుంచి ఏవైనా రిపోర్టులు రాకముందే 2.4 మిలియన్లకు పైగా అకౌంట్లు ముందస్తుగా నిషేధించినట్టు వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు