కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఇదివరకే ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలకు Description జోడించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇటీవల గూగుల్ ప్లే ద్వారా బీటా వర్షన్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది టెస్టర్‌లకు ఇప్పటికే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫీచర్ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు Description జోడించేందుకు వీలు కల్పిస్తోంది.ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్లకు మరింత సమాచారాన్ని జోడించాలనుకునే యూజర్లకు కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.వాట్సాప్ తాజా అప్‌డేట్ ద్వారా ఫార్వార్డ్ చేసిన ఫొటోలకు ఇదివరకే ఉన్న క్యాప్షన్‌ను తొలగించి సొంత క్యాప్షన్ జోడించవచ్చే అవకాశం ఉంది.