lockdown in india WhatsApp reduces Status video time limit to 15 seconds in India (Photo Credits: Pexels)

New Delhi, July 15: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే కొద్దిగంటల్లోనే ఆ మెసేజ్ డిలీట్ (Message delete)చేసే వీలుంది. అయితే ఒకసారి పంపిన మెసేజ్ నిర్ణీత గడువు దాటితే అవతలి యూజర్ చాట్ నుంచి మెసేజ్ డిలీట్ చేయలేం. వాట్సాప్ బీటా (WhatsApp Beta)ఛానెల్‌లో మెసేజ్ పంపిన 2 రోజుల తర్వాత డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లను అనుమతించేందుకు రిలీజ్ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్‌లను పంపిన గంట తర్వాత డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించనుంది. ఈ ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే వర్తించదు. యూజర్లు ఫోటోలు(Photos), వీడియోలు(videos) వంటి మీడియా ఫైల్‌లను ఈజీగా అన్‌సెండ్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌డేట్‌ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ (2.22.4.10) WhatsApp బీటాలో రిలీజ్ కానుంది. ఒక యూజర్‌కు మెసేజ్ పంపిన తర్వాత 2 రోజులు, 12 గంటల్లో తమ మెసేజ్‌లను అన్‌సెండ్ చేయగలరని నివేదిక చెబుతోంది.

Side Effects of Porn: షాకింగ్ సర్వే.. పోర్న్ చూస్తే అది పనిచేయడంలేదట, ఆ వీడియోలు చూస్తూ హస్త ప్రయోగానికి అలవాటుపడుతున్న యూత్, భాగస్వామితో సెక్స్ సమయంలో అంగం స్తంభన సమస్యలు 

వచ్చే ఫిబ్రవరిలో ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్టు పేర్కొంది. కానీ, ఈ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై క్లారిటీ లేదు. వాట్సాప్ మరో డిలీట్-సంబంధిత ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. యూజర్లకు అతి తొందరలోనే ఈ కొత్త ఫీచర్ రానుంది. మీ చాట్‌లోని ఏదైనా మెసేజ్, మీడియా ఫైల్‌లను డిలీట్ చేయాలంటే.. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు (Group Admins)అనుమతి ఉంటుంది. బీటా యూజర్లకు మాత్రం అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్ ఇప్పట్లో రావడం చాలా కష్టమే అని చెప్పవచ్చు.

Autolycos Malware: మీ ఫోన్లో ఈ 8 యాప్స్ ఉన్నాయా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే! యాప్స్‌తో ఫోన్‌లోని డేటా చోరీ చేస్తున్న మాల్‌వేర్, మీకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఖాళీ అవ్వడం ఖాయం  

వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్(online status) నిర్దిష్ట వ్యక్తుల నుంచి హైడ్ చేయవచ్చు. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. గ్రూపు సభ్యుల నుంచి మాత్రమే ఈ స్టేటస్ హైడ్ చేసుకోవచ్చు. కానీ, అడ్మిన్ మాత్రమే మీరు హైడ్ చేసిన విషయం తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా డెవలప్ స్టేజీలోనే ఉంది. బీటా యూజర్లకు అందుబాటులో లేదు. మరోవైపు.. 2022 చివరిలో Whatsapp కమ్యూనిటీలను తీసుకురానుంది. గ్రూప్ అడ్మిన్‌లకు డిలీట్ ఆప్షన్ కూడా Whatsapp కమ్యూనిటీలతో పాటు ప్రవేశపెట్టనుంది.