WhatsaApp (Photo Credits: Pxfuel)

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ గా వాట్సాప్ (WhatsApp) నిలుస్తోంది. ప్రస్తుతం ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను రన్ చేస్తుండగా.. దీనిలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. యూజర్లకు మరిన్ని సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తెస్తూనే ఉంది. కోట్లలో వాట్సాప్ అకౌంట్లు ఉండగా.. వాటిలో ఫేక్ అకౌంట్లు కూడా భారీగా ఉన్నాయి. దీంతో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఫేక్ వాట్సాప్ అకౌంట్ల నియంత్రణకు మరియు అనుమతి లేకుండా వాట్సాప్ లాగిన్ అవకుండా వాట్సాప్ కొత్తగా సెక్యూరిటీ ఫీచర్ ని తీసుకువస్తోంది. ఈమేరకు వాట్సాప్ బీటా ఇన్ఫో ఓ నివేదికలో దీని గురించి వివరాలను వెల్లడించింది. 'మరొక డివైజ్ నుంచి వాట్సాప్ అకౌంట్‌కు లాగిన్ అవ్వడానికి అదనపు వెరిఫికేషన్ కోడ్ కూడా అవసరమయ్యేలా వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్‌పై పని చేస్తోంది' అని వాట్సాప్ బీటా ఇన్ఫో తన నివేదికలో రిపోర్ట్ చేసింది. ఇప్పటి వరకు వాట్సాప్ లాగిన్ అవడానికి వన్ స్టెప్ వెరిఫికేషన్ ఉండగా.. ఇక మీదట అది టూ స్టెప్ వెరిఫికేషన్ గా మారనున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ని మనం మరో డివైస్ లో లాగిన్ అవడానికి ప్రయత్నిస్తే.. అది సెక్యూరిటీ చెక్ కోసం ఆరు డిజిట్ల లాగిన్ లాక్ ను అడుగుతుంది. అయితే ఇక మీదట కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి వస్తే మరో సెక్యూరిటీ చెక్ జరగనుంది. అంటే రెండుసార్లు లాగిన్ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాగైతే మామూలు సెక్యూరిటీ చెక్ కింద వాట్సాప్ లాక్ అడుగుతుందో.. ఇక మీదట దీనితో పాటు వాట్సాప్ నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తే కానీ వాట్సాప్ లాగిన్ కాదు. అంటే ఇక మీదట మీ వాట్సాప్ ని డివైస్ లో లాగిన్ చేయాలనుకుంటే ఓటీపీని తప్పకుండా ఎంటర్ చేయాలి. ఇలా చేస్తే అన్ ఆథర్డైజ్డ్ లాగిన్లు తగ్గుతాయని వాట్సాప్ భావిస్తోంది.

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై సినిమా కూడా వాట్సాప్‌లో పంపించుకోవచ్చు, కొందరికి అందుబాటులోకి వచ్చిన ఫీచర్, మీరు కూడా ఇలా ట్రై చేయండి!

ఇక వాట్సాప్ లో మరో 3 కొత్త ఫీచర్స్ (New features and updates) రాబోతున్నాయి. అవి వస్తే వాట్సాప్ వినియోగదారులకు ఎంతో సౌకర్యం కలుగనుంది. వాటిలో మొట్టమొదటిది “ఎడిట్ టెక్స్ట్ మెసేజ్”(edit text message) ఫీచర్. మనం ఇతరులకు పంపే మెసేజ్ లో ఏదైనా తప్పు ఉంటే .. దాన్ని పూర్తిగా డిలీట్ చేసి, మరో మెసేజ్ ను కొత్తగా పంపాల్సి వస్తోంది. దీన్ని విలువైన సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. మనం పంపిన వాట్సాప్ మెసేజ్ లో ఏదైనా తప్పు, మార్పు ఉంటే .. ఎడిట్ చేసే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఇతరుల ఫోన్లకు చేరిన మెసేజ్ ..మనం ఎడిట్ చేసిన విధంగా అప్ డేట్ అయిపోతుంది. ఫలితంగా వాట్సాప్ మెసేజ్ లు డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసేయొచ్చు.

WhatsApp: వాట్సాప్ దారులకు హెచ్చరిక, 16 లక్షలపైగా వినియోగదారుల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్  

“undo” ఫీచర్ : వాట్సాప్ లో “undo” (అన్ డూ) అనే ఫీచర్ కూడా రాబోతోంది. మనం ఇతరులకు పంపిన మెసేజ్ లు అప్పుడప్పుడు వెంటనే డిలీట్ చేస్తుంటాం. ఈక్రమంలో “delete for me” అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంటాం. ఇటువంటి సందర్భంలో డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ పొందలేం. కానీ త్వరలో మనం “delete for me” అనే ఆప్షన్ ను క్లిక్ చేయగానే.. “undo” అనే మరో ఆప్షన్ ప్రత్యక్షం అవుతుంది. అంటే డిలీట్ అయిన మెసేజ్ ను తిరిగి పొందే అవకాశం లభిస్తోందన్న మాట.

chat filters ఫీచర్ : chat filters అనే ఆప్షన్ కూడా వాట్సాప్ లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దీన్ని డెస్క్ టాప్ వర్షన్ల కోసం పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. సెర్చ్ బార్ పక్కనే.. chat filters ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేయగానే ..మనం ఇప్పటికే చదివిన వాట్సాప్ మెసేజ్ లన్నీ మాయం అవుతాయి. ఇంకా మనం తెరువని మెసేజ్ లు మాత్రమే కనిపిస్తాయి. వీటిని చదివాక.. clear filters అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే చాట్ బాక్స్ మునుపటిలా కనిపిస్తుంది.

ఇక ఎటువంటి శ్రమ లేకుండా చాలా సులభంగా మీ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరియు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్ షీట్ల వంటి ముఖ్యమైన ID పత్రాలను కూడా మీ Whatsapp నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు వాట్సాప్ లో MyGov చాట్బాట్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా DigiLocker యాప్ లేదా మరే ఇతర వెబ్సైట్కి వెళ్లే అవసరం లేకుండానే వాట్సాప్ వినియోగదారులు తమ ఫోన్లో ఈ రికార్డులను తిరిగి పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

డిజిలాకర్ కోసం కొత్త అకౌంట్ ను క్రియేట్ చెయ్యడానికి కూడా ఈ చాట్బాట్ సహాయపడుతుంది. డిజిలాకర్ భారత రవాణా మంత్రిత్వ శాఖ చేత గుర్తింపు పొందింది. అంతేకాదు, దేశంలో ఎక్కడైనా అవసరమైనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టూ-వీలర్ ఇన్సూరెన్స్ లేదా RC డిజిటల్ ఫారమ్లను చూపించడానికి ప్రజలకు సహాయం చేస్తుంది.

Whatsapp లో డిజిలాకర్ నుండి పత్రాలను డౌన్లోడ్ ఎలా చెయ్యాలి.!

1. మీ ఫోన్ లో WhatsApp యాప్ తెరవండి

2. +919013151515 నంబర్ కి "DigiLocker" అని టైప్ చేసి మెసేజ్ పంపండి

3. తరువాత, మీరు DigiLocker అకౌంట్ ను క్రియేట్ చేయడానికి లేదా నిర్ధారించడానికి అప్షన్ లను చూస్తారు

4. ఇది మీకు పత్రాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది (మీ ఆధార్ నంబర్ని ఉపయోగించి సైన్ అప్ చేసిన తర్వాత).

5. ఇక్కడ మీరు పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) లేదా క్లాస్ X, మరియు XII మార్క్ షీట్ల వంటి డాక్యుమెంట్ ఎంపికలతో కూడిన Menu ని చూస్తారు.

6. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు

డిజిలాకర్ ఎన్క్రిప్షన్ సురక్షితమైనదని పేర్కొంది మరియు ఈ ప్లాట్ఫారమ్లో ఉన్న డాక్యుమెంట్ లకు మాత్రమే యూజర్లకు యాక్సెస్ ఇస్తుంది.