Always Mute Option (Photo-Twitter/Whatsapp inc)

అమెరికా దిగ్గజం ఫేస్‌బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్స్‌యాప్ యూజర్ల కోసం కీలక ఫీచర్‌ను (WhatsApp new features) తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు ఈ కొత్త అప్ డేట్ అందించింది. ఇకపై వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ (Always Mute Option) తో ఎప్పటికీ మ్యూట్ చేసే విధంగా ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది.

వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రజలు ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఆల్వేస్ మ్యూట్ ఎంచుకోవచ్చు.

Here's WhatsApp Inc Tweet

చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి (groups chats) నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్‌ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.