New Delhi, NOV 15: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ (WhatsApp Rolls Out Voice Chat) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మెసేజింగ్ సర్వీస్‌లో గ్రూప్ కాల్స్ (Group Calls) చేసేటప్పుడు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్ (WhatsApp Voice Chat) ఎలా పనిచేస్తుంది? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం, గ్రూప్ కాల్స్ సమయంలో వాట్సాప్ యూజర్లకు రింగ్ మాత్రమే వస్తుంది. వాట్సాప్‌లో గ్రూపు కాల్ చేసినప్పుడు.. ఆయా గ్రూపులోని మెంబర్లందరికి రింగ్‌తో పాటు జాయిన్ అవ్వాలంటూ నోటిఫికేషన్ వస్తుంది. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఇలాంటి గ్రూపు కాల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ తరహా ఇబ్బందులను నివారించేందుకు వాట్సాప్ వాయిస్ చాట్ ఫీచర్ రిలీజ్ చేసింది.
rolling out now: voice chat for your larger groups!
you’ll soon have the option to talk it out live with whoever can join or keep texting with whoever can’t
— WhatsApp (@WhatsApp) November 13, 2023
ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా గ్రూపు కాల్ (Group Call) వచ్చినా రింగ్‌టోన్ రాదు. గ్రూపులోని వారిందరికి నోటిఫికేషన్ మ్యూడ్ మోడ్‌లో స్ర్కీన్‌ఫై ప్రాంప్ట్ కనిపిస్తుంది. వాయిస్ చాట్ ఫీచర్ ద్వారా గ్రూపు కాల్ ఎండ్ అయ్యేలోగా ఏ సమయంలోనైనా ఈజీగా జాయిన్ అవ్వొచ్చు. అయితే, ఈ వాయిస్ చాట్‌తో గ్రూపు కాల్ కేవలం 60 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం ఉంటుంది.
ఆ తర్వాత ఆటోమాటిక్‌గా కాల్ డిస్ కనెక్ట్ అయిపోతుంది. అంతేకాదు.. గ్రూపు కాల్‌లో జాయిన్ అయిన యూజర్లు మాత్రమే వాయిస్ ఛాట్ వినే అవకాశం ఉంటుంది. కానీ, వాయిస్ ఛాట్‌లో పాల్గొనని యూజర్లు గ్రూపులో కాల్‌లోని యూజర్ల ప్రొఫైల్‌ను మాత్రం చూసేందుకు వీలుంటుంది. ఆండ్రాయిడ్‌లో వాయిస్ చాట్‌లకు సంబంధించి గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ఐఓఎస్ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లకు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వాయిస్ చాట్ ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. గ్రూప్ వాయిస్ చాట్ ఎనేబుల్ చేయగానే గ్రూప్ కాల్ బటన్ స్థానంలో వాయిస్ చాట్ ఆప్షన్ చూడవచ్చు.
గ్రూప్ చాట్‌లో (Group Chat) స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో కొత్త వేవ్‌ఫార్మ్ ఐకాన్ నొక్కడం ద్వారా వాయిస్ చాట్ ప్రారంభమవుతుంది. అప్పుడు గ్రూప్‌లోని సభ్యులు జాయిన్ అయ్యేలా పుష్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు. గ్రూపులోని ప్రతి ఒక్కరూ వాయిస్ చాట్‌లో భాగం కాదని గమనించాలి. కానీ, మీరు గ్రూపుకాల్‌లో భాగం కాని ఇతర గ్రూప్ సభ్యులకు టెక్స్ట్ పంపడం వంటివి చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు వాయిస్ చాట్‌లో నుంచి ఎప్పుడైనా బయటకు రావొచ్చు. అవసరమైతే మళ్లీ జాయిన్ అయ్యేందుకు అనుమతిస్తుంది. వాయిస్ చాట్‌లో పాల్గొనే వారందరూ నిష్క్రమించిన తర్వాత వాయిస్ చాట్ దానంతట అదే ఆగిపోతుంది. గ్రూపు కాల్‌లో పాల్గొనేవారు ఎవరూ చేరనట్లయితే లేదా ఒక గంట పాటు చాట్‌లో ఒక వ్యక్తి మాత్రమే ఉంటే వాయిస్ చాట్ కూడా ముగుస్తుంది.
వాట్సాప్ ప్రకటనలో వాయిస్ చాట్స్ ఫీచర్ మొదట 32 కన్నా ఎక్కువ మంది సభ్యులతో కూడిన పెద్ద గ్రూపులకు అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. వాట్సాప్ ప్రకారం.. ఈ ఫీచర్ 33 మంది నుంచి 128 మంది పాల్గొనే గ్రూపులలో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. యూజర్ ప్రైమరీ డివైజ్ ద్వారా మాత్రమే ఈ యాక్సస్ సాధ్యపడుతుంది. ఇతర లింక్ చేసిన డివైజ్‌లకు సపోర్టు చేయదని గమనించాలి.
వాట్సాప్ వాయిస్ చాట్ ఎలా ఎనేబుల్ చేయాలంటే? :
* మీరు ఫీచర్‌ని పొందిన వెంటనే.. వాయిస్ చాట్ ఎనేబుల్ చేసేందుకు గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయాలి.
* ఇప్పుడు, స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న ఆడియో ఐకాన్ నొక్కండి.
* వాయిస్ చాట్ స్టార్ట్ బటన్‌పై క్లిక్ చేయండి.
* వాయిస్ చాట్ నుంచి నిష్క్రమించడానికి X బటన్‌ను నొక్కండి.