WhatsApp Web’s four features that you can try right away(Photo-pixabay)

Mumbai, January 04: మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ (WhatsApp) ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. 2015లో వెబ్-ఫ్రెండ్లీ వెర్షన్ యాప్ (WhatsApp Web) ప్రవేశపెట్టిన సంగతి విదితమే. మొబైల్ వెర్షన్ మాదిరిగానే డెస్క్ టాప్ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వెబ్ వెర్షన్ ద్వారా యూజర్లు ఈజీగా తమ మొబైల్ వాట్సప్ నుంచి డెస్క్ టాప్ యాక్సస్ చేసుకోనే సౌకర్యాన్ని కల్పించారు. మొబైల్ వెర్షన్ (Mobile Version)ఫీచర్లన్నీ దాదాపు వెబ్ వెర్షన్‌కు(Web Version) కూడా ఆఫర్ చేసింది. అయితే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ లాంటివి మాత్రం వాట్సప్ వెబ్ ద్వారా చేయలేరు. మరి ఇతర ప్రయోజనాలు ఏమోన్నాయో ఓ సారి చూద్దాం.

రెండు అకౌంట్లు ఒకేసారి వాడొచ్చు

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా వాట్సప్ యాక్సస్ చేసుకుంటే మీరు రెండు అకౌంట్లను ఒకేసారి ఆపరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాట్సప్ అకౌంట్‌ను క్రోమ్ రెగ్యులర్ మోడ్ లో యాక్సస్ చేసుకోండి. రెండో వాట్సప్ అకౌంట్ Incognito Modeలో యాక్సస్ చేసుకోండి. వాస్తవానికి వాట్సాప్ తమ యూజర్లకు సింగిల్ బ్రౌజర్‌పై ఒక అకౌంట్ మాత్రమే యాక్సస్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, మల్టీపుల్ వాట్సప్ అకౌంట్లను ఒకేసారి సింగిల్ బ్రౌజర్ పై ఈజీగా యాక్సస్ చేసుకునే వీలుంది.

WA Toolkit Extension 

మీరు వాడే Browserకు ఈ WA Toolkit Extension యాడ్ చేయడం ద్వారా రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు. అందులో ఒకటి Background Notification, రెండోది Full width chat bubble. ఈ రెండింటితో ఈజీగా వాట్సప్ మెసేజ్ లను ఆపరేట్ చేసుకోవచ్చు.

i) Background Notification:

ఈ బ్యాక్ గ్రౌండ్ నోటిఫికేషన్ ద్వారా వాట్సప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. యాప్ చాట్ బాక్సులో వచ్చిన మెసేజ్‌ను ఈజీగా రీడ్ చేయొచ్చు. మీరు చదవని ఏదైనా వాట్సప్ మెసేజ్ ను Extension ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా ఆయా మెసేజ్ లను చూడవచ్చు. దీనికి అదనంగా ఏ వాట్సప్ కాంటాక్ట్ నెంబర్ మెసేజ్ రీడ్ చేయలేదో కూడా చెక్ చేసుకోవచ్చు.

ii) Full width chat bubble:

దీని ద్వారా చాట్ బబుల్ విండో డిఫాల్ట్‌గానే ఫిట్ గా ఉంటుంది. టెక్స్ట్ పరిమాణం ఎక్కువగా ఉన్నప్పటికీ చాట్ విండో సాగిపోదు. ఎక్కువ కంటెంట్ ఉన్నప్పటికీ అది మల్టీ లైన్లలోకి ఆటోమాటిక్‌గా అడ్జెట్ అవుతుంది. ఒకవేళ మెసేజ్ మధ్యలో లైన్ గ్యాప్ ఉన్నా కూడా ఫిక్సడ్ గానే కనిపిస్తుంది. ఈ టూల్ ద్వారా వాట్సప్ చాట్ బబుల్‌ను సాగనీయకుండా ఫిక్స్ చేస్తుంది.

Emoji shortcut 

వాట్సప్ వెబ్ టెక్ట్స్ బార్ ఎడమవైపు భాగంలో ఈ ఫీచర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే యాప్‌లోని ఎమోజీస్ లైబ్రరీ మొత్తం ఓపెన్ అవుతుంది. Emoji Tray ఓపెన్ చేయకుండా ఏదైనా Emoji యాక్సస్ చేసుకోవడానికి ఒక Shortcut కూడా ఉంది. ఒక ఎమోజీని యాక్సస్ చేయాలంటే ముందుగా దాని పేరులో తొలి రెండు పదాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు పదాలకు ముందు తప్పనిసరిగా (:) ఉంచాల్సి ఉంటుంది.

Picture-in-Picture (PiP) mode 

వివిధ ప్లాట్ ఫాంలైన యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నుంచి వీడియోలను చూసేందుకు ఈ ఫీచర్ అనుమతి ఇస్తుంది.యాప్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే అక్కడి నుంచే ఈజీగా మీరు చూడవచ్చు వీడియోలు చూస్తూ ఛాట్ కూడా చేసుకోవచ్చు.