WhatsApp (Photo Credits: Pixabay)

New Delhi, April 02: ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌.. వాట్సాప్‌ (Whatsapp) తన యూజర్లకు అనునిత్యం కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉన్నది. యూజర్ల ప్రైవసీ (Privacy) మరింత పెంచడానికి సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా ఆండ్రాయిడ్‌ బేటా వర్షన్‌ పరీక్షిస్తున్నట్లు వినికిడి. తాజాగా లాక్‌ చాట్‌ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌ వాట్సాప్‌ డెవలప్‌ చేస్తున్నది. ఈ లాక్‌ చాట్‌తో (Lock Chat) యూజర్లు తమ ప్రైవేట్‌ చాట్లకు లాక్‌ విధించుకునే అవకాశం ఉంటది. అంటే ప్రతి ఒక్క వాట్సాప్‌ యూజర్‌కు తన పర్సనల్‌ చాట్‌లపై పూర్తిగా నియంత్రణ తెచ్చుకోవచ్చు. ఈ లాక్‌ చాట్‌ ఫీచర్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తే యూజర్ల ప్రైవసీతోపాటు సెక్యూరిటీ కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వాబ్‌టా ఇన్‌ఫో నివేదిక ప్రకారం ఒకసారి లాక్‌ చాట్‌ ఆప్షన్‌ వినియోగిస్తే యూజర్‌ తన ఫింగర్‌ ప్రింట్‌ లేదా పాస్‌వర్డ్‌తో మాత్రమే తిరిగి చాట్‌ వివరాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

Twitter to Remove Blue Ticks: బ్లూ టిక్స్ తొలగించనున్న ట్విట్టర్, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి మస్క్ నిర్ణయం, ఇకపై ప్రతి ఒక్కరూ డబ్బులు పెట్టి బ్లూ టిక్ కొనాల్సిందే! 

ఇతరులు ఎవ్వరూ మీ ఫోన్‌ చాట్‌ చూసే అవకాశం ఉండదు. లాక్డ్‌ చాట్‌లో పంపే వీడియోలు, ఫొటోలు ఆటోమేటిక్‌గా ఫోన్‌ గ్యాలరీలో సేవ్‌ కావు. ఇతరులు సున్నితమైన సమాచారం చూడకుండా లాక్‌ చాట్‌ అదనపు ప్రొటెక్షన్‌ లేయర్‌గా ఉంటుంది. ఎవరైనా మీ ఫోన్‌ తీసుకుని పాస్‌వర్డ్‌ / ఫింగర్‌ ప్రింట్‌ లేకుండా లాక్‌ చాట్‌ తెరవడానికి ప్రయత్నిస్తే.. ఆ చాట్‌ మొత్తం డిలిట్‌ చేయాలని కోరుతుంది.

Google Penalty: గూగుల్‌కు మరోసారి ఎదురుదెబ్బ, రూ. 1,337 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే, 30 రోజుల్లోగా ఫైన్ పూర్తిగా కట్టాలంటూ ఆదేశం, ఇంతకీ గూగుల్‌కు ఎందుకు ఫైన్ వేశారంటే? 

ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెవలప్‌మెంట్‌ దశలోనే ఉంది. దీన్ని అధికారికంగా ఎప్పుడు బయట పెడతారన్న సంగతి తెలియాల్సి ఉంది. ఇంకా యూజర్ల టైపింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పెంచడానికి అదనపు ఫార్మాటింగ్‌ ఆప్షన్లతో ‘టెక్ట్స్‌ ఎడిటర్‌’ అనే ఫీచర్‌ అందుబాటులోకి తేవడానికి వాట్సాప్‌ కృషిచేస్తున్నట్లు తెలుస్తున్నది.