సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ( WhatsApp)యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ వాట్సప్ స్టేటస్ ( WhatsApp Status)ని ఇకపై నేరుగా మీ ఫేస్‌బుక్ (Facebook)లో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఇంతకు ముందు బీటా వర్షన్ లో అందుబాటులో ఉండగా ఇప్పుడు లైవులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’ (Share to Facebook story)బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్‌బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. స్టేటస్ అప్‌డేట్ తర్వాత కుడివైపు వుండే మూడు చుక్కలను క్లిక్ చేస్తే మీకు ‘షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీ’అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ స్టోరీలో షేర్ అవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు అన్ని వాట్సప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఫేస్‌బుక్‌కు వాట్సాప్ స్టేటస్ డైరెక్ట్ షేరింగ్ కోసం ఇలా చేయండి
1. ముందుగా వాట్సప్‌లోని స్టేటస్ లోకి వెళ్లండి
2. మీకు నచ్చిన వాట్సప్ స్టేటస్ చిత్రం లేదా వీడియోను అప్‌లోడ్ చేయండి.
3. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక కుడివైపున ఉన్న మూడు చుక్కల్ని క్లిక్ చేసి షేర్ టు ఫేస్‌బుక్ స్టోరి అనే ఆప్షన్‌ను ఎంచుకుని పబ్లిష్ చేయండి.
దీంతో పాటుగా మ్యూట్' స్టేటస్‌కు సంబంధించి కూడా కొత్త అప్‌డేట్ తీసుకు రానుంది. మ్యూట్ చేసిన వ్యక్తుల షేరింగ్ పూర్తిగా కనిపించకుండా చేసే కొత్త ఫీచర్‌పై ఇప్పుడు వాట్సప్ పనిచేస్తోంది. ఇదిలా ఉంటే ఆండ్రాయిడ్ , తాజా బీటా వెర్షన్ వినియోగదారులు తమ కాంటాక్ట్స్‌లోని వారి స్టేటస్‌ను మ్యూట్ చేసుకునే అవకాశం ఇప్పటికే ఉన్నసంగతి తెలిసిందే. అయితే మ్యూట్ చేసిన తరువాత కూడా ఆయా వ్యక్తుల స్టేటస్‌లు హైలెట్ కాకుండా బూడిద రంగులో మనకి కనిపిస్తూనే వుంటాయి. ఇకపై ఇలా కనిపించకుండా చేయాలని వాట్సప్ ప్లాన్ చేస్తోంది.