Wi-Fi HaLow: వైఫై హాలో, ప్రపంచాన్ని మార్చబోతున్న కొత్త టెక్నాలజీ, కిలోమీటర్ దూరంలో ఉన్నా మీ వైఫైతో కనెక్ట్ కావొచ్చు, వైఫై హాలో అంటే ఏమిటి, ఎలా పని చేస్తుందో ఓ సారి చూద్దాం
WiFi (Representational Image)

రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా అనేక రకాలైనవి యూజర్లకు కనువిందు కలిగిస్తున్నాయి. తాజాగా తదుపరి తరం వైఫ్ అందుబాటులోకి రాబోతోంది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) టెక్నాలజీతో మీరు కిలోమీటర్‌ దూరంలో ఉన్నా వైఫై వినియోగించుకునేందుకు వీలుగా వైఫై హాలో (wifi halow) రానుంది.

Wi-Fi HaLow అనేది Wi-Fi-కనెక్ట్ చేయబడిన పరికరాల కోసం దూరాలను విస్తరించడానికి, బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచడానికి Wi-Fi యొక్క తదుపరి తరం మాత్రమే కాదు, IoT (Internet of things ) అంతటా వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయబడిన వ్యక్తులు, పరికరాల యొక్క అద్భుతమైన భవిష్యత్తును కూడా ఇది సూచిస్తుంది. సెన్సార్‌లు, యాక్యుయేటర్‌లు, సెక్యూరిటీ కెమెరాల నుండి ఇంటి ఆటోమేషన్, ఉపకరణాలు, థర్మోస్టాట్‌ల వరకు, ఇన్‌స్టాలేషన్, కార్యాచరణ ఖర్చులను తగ్గించేటప్పుడు వినియోగదారు అనుభవాన్ని, ఉత్పాదకతను మెరుగుపరచడానికి అప్లికేషన్‌లు వీటన్నింటికీ అనుసంధాన కర్తగా Wi-Fi HaLow పని చేయనుంది.

Wi-Fi HaLow సాంకేతికత ఇటీవల IEEE 802.11ah టాస్క్ గ్రూప్ ద్వారా ప్రమాణీకరించబడింది. Wi-Fi అలయన్స్ (WFA) ద్వారా దాని పేరును  పొందింది. ఇది లైసెన్స్ లేని సబ్-1 గిగాహెర్ట్జ్ (GHz) ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో పనిచేస్తుంది. డేటా-రేట్లను వందల kbits/s నుండి పదుల Mbits/s వరకు, పదుల మీటర్ల నుండి కిలోమీటరు కంటే ఎక్కువ దూరం వరకు అందిస్తుంది. Wi-Fi HaLow అత్యంత సవాలుగా ఉన్న IoT (Internet of things) పరిసరాలను పరిష్కరించడానికి అవసరమైన స్కేలబిలిటీ, పటిష్టత, భద్రతా డిమాండ్లను మెరుగైన సేవలను అందిస్తుంది.

యూజర్లకు గూగుల్ హెచ్చరిక, ఈ కీబోర్డుతో పాటు యాప్స్ వెంటనే ఫోన్ నుండి డిలీట్ చేయాలని అలర్ట్, జోకర్‌ మాల్వేర్‌ ఉన్నట్లు తెలిపిన ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం

వైఫై హాలో అంటే ఏమిటి

'వైఫై హాలో' అంటే సింపుల్‌ గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఐఓటీ ప్రొడక్ట్‌లు స్మార్ట్‌ స్పీకర్స్‌, స్మార్ట్‌ ఎయిర్‌ కండీషనర్స్‌ తో పాటు స్మార్ట్‌ హోం సెక్యూరిటీ సిస్టం, వేరబుల్‌ హెల్త్‌ మానిటర్స్‌, బయో మెట్రిక్‌ సైబర్‌ సెక్యూరిటీ స్కానర్స్‌'ను కిలోమీటర్‌ దూరంలో ఉన్నా వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్‌ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వైఫై నెట్‌ వర్క్‌లను అందించే 'వైఫై అలయన్స్‌' సంస్థ తెలిపింది. పరిమిత సంఖ్యలో వైఫై కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్న స్మార్ట్‌ డివైజెస్‌లో పనిచేస్తుందని చెప్పింది. వైఫై టెక్నాలజీ కోసం కొత్త ఎక్విప్‌మెంట్‌ అవసరం లేదని,ప్రస్తుతం మన రోజూ వారి జీవితంలో భాగమైన వైఫై సెటప్‌తోనే ఈ వైఫై హాలో పనిచేస్తుందని వెల్లడించింది.

వైఫై హాలోని వినియోగించుకునే అప్లికేషన్లు

వైఫై హాలో'ని ఇళ్లు, సంస్థల్లో ఉండే స్మార్ట్‌ పరికరాలను కనెక్ట్‌ చేయడంతో పాటు వివిధ రకాలైన అప్లికేషన్‌లలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో (స్మార్ట్‌ అగ్రికల్చర్‌)సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా టెక్నాలజీ పరంగా మరింత అప్‌ డేట్‌ కావొచ్చని నిపుణులు చెబుతుండగా.. తక్కువ సమయంలో పెద్దమొత్తంలో ఉన్న డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు ఉపయోగపడే వైఫై నెట్‌ వర్క్‌కు ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు.

వైఫై హాలో ఎలా పని చేస్తుంది?

వైఫై హాలో టెక్నాలజీ ఇళ్లులో, లేదంటే రైల్వే స్టేషన్‌లలో వినియోగించే వైఫై కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాధారణ వైఫై నెట్‌వర్క్‌లు వినియోగించడం వల్ల ఖర్చయ్యే కరెంట్‌ కంటే..తక్కువ స్థాయిలో కరెంట్‌ వినియోగంతో దూరంలో ఉన్నా సరే ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. బ్యాండ్‌ విడ్త్ పరంగా వైఫై హాలో సాధారణ వైఫై బ్యాండ్‌ విడ్త్‌ 2.4జీహెచ్‌జెడ్‌ నుండి 5జీహెచ్‌జెడ్‌'ల కంటే తక్కువ స్థాయిలో అంటే కేవలం 1జిహెచ్‌జెడ్‌ తో పనిచేసేలా డెవలప్‌ చేస్తున్నట్లు వైఫై అలయన్స్‌ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.