New Delhi, December 17: దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 పీసీ (Windows 10 PC Users) యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై యూజర్లు తమ పీసీని, ఆండ్రాయిడ్ ఫోన్‌ను (Android Phone) కనెక్ట్ చేసుకుని నేరుగా పీసీ (PC) నుంచే కాల్స్ చేసుకోవచ్చు, అలాగే వాటిని రీసీవ్ చేసుకోవచ్చు.దీంతో పాటుగా ఫోన్‌కు (Android Phone) వచ్చే ఎస్‌ఎంఎస్‌లను(SMS) కూడా పీసీలోనే చూసుకోవచ్చు.
అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే విండోస్ 10 యూజర్లు (Windows 10 Users)తమ పీసీలో మైక్రోసాఫ్ట్ అందించే యువర్ ఫోన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని కోసం విండోస్ 10 ఏప్రిల్ 2018 ఆ తరువాత వచ్చిన ఓఎస్ అప్‌డేట్‌ను యూజర్లు తమ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకుని ఉండాలి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్‌లో యువర్ ఫోన్ కంపానియన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్‌స్టాలేషన్ జరగాలంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఓఎస్ ఆండ్రాయిడ్ 7.0 ఆపైన వెర్షన్ తప్పక ఉండాలి.
ఇక రెండు డివైస్‌లలోనూ ఆ యాప్‌లలో యూజర్లు తమ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌తో లాగిన్ అయి అనంతరం ఫోన్‌ను ఓటీపీతో వెరిఫై చేసుకోవాలి. దీంతో ఫోన్, పీసీకి సింక్ అవుతుంది. ఇక ఆ తరువాత పీసీపై వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ కోసం వెదుక్కోవాల్సిన పనిలేకుండా నేరుగా ఆ కాల్స్‌ను పీసీ నుంచే స్వీకరించవచ్చు. అలాగే ఫోన్‌తో సంబంధం లేకుండా పీసీలోని ఆ యాప్ నుంచే నేరుగా ఎవరికైనా కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు చేయవచ్చు.