YouTube (Photo Credits : Facebook)

గ‌త ఏడాదిగా మెరుగైన వేత‌నాలు కోరుతున్న 43 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌పై యూట్యూబ్ మ్యూజిక్ టీమ్ వేటు వేసింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల బృందం గూగుల్‌, కాగ్నిజెంట్‌ల కోసం ప‌నిచేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగులు గ‌త ఏడాది కాలంగా మెరుగైన వేత‌నాలు, ప్ర‌యోజ‌నాల‌ను డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ వీరందని తీసేస్తున్నట్లు ప్రకటించింది.

ఆగని లేఆప్స్, 3,400 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ గృహోపకరణాల సంస్థ Bosch

త‌మ‌కు ఎలాంటి ముంద‌స్తు నోటీసులు జారీ చేయ‌లేద‌ని, అనూహ్యంగా లేఆఫ్స్‌కు తెగ‌బ‌డ్డార‌ని ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్ల తొల‌గింపుతో త‌మ‌కు సంబంధం లేద‌ని, వీరిని కాగ్నిజెంట్ నియ‌మించుకుంద‌ని గూగుల్ పేర్కొంది. ఇక వీరి కాంట్రాక్ట్ గ‌డువు ముగిసింద‌ని కాగ్నిజెంట్ వివ‌ర‌ణ ఇచ్చింది. కంపెనీలో ఇత‌ర విభాగాల్లో వీరిని స‌ర్దుబాటు చేసేందుకు ఏడు వారాల పాటు వేత‌నం చెల్లిస్తామ‌ని పేర్కొంది.