China Girl’s Arangetram (Credits: X)

Newdelhi, Aug 13: భారత సాంప్రదాయాలకు విదేశాల్లో ఎంతో గౌరవం ఉంది. మన ఆచార, వ్యవహారాలను విదేశీయులు ఎంతో ఇష్టపడుతారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. పొరుగు దేశం చైనాలో మన సంప్రదాయ నృత్యానికి కూడా ఆదరణ పెరుగుతోంది. భరత నాట్యం (Bharata Natyam) నేర్చుకోవడానికి చైనా చిన్నారులు క్యూ కడుతున్నారు. తాజాగా బీజింగ్ లో చైనా బాలిక లియ్ ముజి (13) అరంగేట్రం (Arangetram) ప్రదర్శన చేసింది. అలా చైనాలో భరత నాట్యం నేర్చుకుని సోలోగా అరంగేట్రం చేసిన తొలి బాలికగా ముజి రికార్డు సృష్టించింది.

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు.. ట్రాఫిక్‌ ఎస్‌ఐపై మహిళల దాడి.. అసలేం జరిగింది?

ఏమిటీ అరంగేట్రం?

భరత నాట్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు తొలిసారిగా గురువు, ఇతరుల ముందు ప్రదర్శన చేయడాన్ని అరంగేట్రంగా వ్యవహరిస్తారు.

పాట్నా విమానాశ్రయంలోని రన్ వే పై ముంగిస, పాము మధ్య ఫైట్.. వీడియో వైరల్