Paris January 06: గూగుల్(Google), ఫేస్ బుక్(Facebook )లకు భారీ షాక్ ఇచ్చింది ఫ్రాన్స్(France). తమ చట్టాలకు భిన్నంగా బిజినెస్ పద్దతులను అవలంభిస్తున్నందుకు పెద్ద మొత్తంలో ఫైన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గూగుల్, ఫేస్‌బుక్‌లపై 210 మిలియన్ల యూరోలు (237 మిలియన్ల డాలర్లు) ఫైన్ విధించింది. ఫ్రాన్స్ డేటా ప్రైవసీ వాచ్ డాగ్ సీఎన్ ఐఎల్(France's National Commission for Information Technology and Freedom) భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ బ్రౌజింగ్(Internet Browsing) చేసే సమయంలో ఆన్ లైన్ ట్రాకర్స్ కుకీస్(cookies) కు యూజర్లు నో చెప్పడానికి వీలు లేకుండా గూగుల్ కఠినతరం చేసిందని ఫ్రాన్స్ డేటా ప్రైవసీ వాచ్ డాగ్ సీఎన్ఐఎల్(CNIL) ఆరోపించింది. దీనికి గాను గూగుల్ కు 150 మిలియన్ యూరోలను జరిమానా విధించింది. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 1,265 కోట్లు జరిమానా విధించింది.
అలాగే ఇదే కారణంతో మెటా(Meta)లో భాగం అయిన ఫేస్‌బుక్ కు కూడా భారీ జరిమానా విధించింది. ఫేస్ బుక్ కు 60 మిలియన్ల యూరోలు అంటే దాదాపు రూ. 505 కోట్లు జరిమానా విధించింది. అలాగే వీటిని సరి చేసుకోవాలని గూగుల్, మెటా లను ఆదేశించింది. తాము చెప్పిన మార్పులు చేయకుంటే రోజుకు లక్ష యూరోలు అంటే రూ. 85 కోట్లు జరిమానా విధిస్తామని తెల్చిచెప్పింది. తమ పద్దతులు మార్చుకునేందుకు గూగుల్, ఫేస్‌బుక్‌లకు మూడు నెలల గడువు ఉంది.
అయితే దీని పై గూగుల్ ప్రతినిధి స్పందించారు. సీఎన్ఐఎల్ చెప్పిన మార్పులను చేస్తామని ప్రకటించారు. గూగుల్, ఫేస్‌బుక్‌లతోపాటు టెక్ దిగ్గజాలు ఆపిల్(Apple), అమెజాన్(Amazon) వ్యాపార పద్దతులపై యూరప్ వ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్నది. ఈయూ దేశాలన్నీ వీటిపై భారీ ఫైన్ విధిస్తున్నాయి.