Islamabad, OCT 15: పాకిస్థాన్‌లో (Pakistan) అత్యంత దారుణమైన, ఆందోళనకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి పై కప్పులో 500 మృత దేహాలను కనుగొన్నారు! ఈ మృతదేహాలు కుళ్లిపోయిన దశలో (decomposing corpses) ఉన్నాయి..!! శరీరభాగాలు లేకుండా అత్యంత భయానక స్థితిలో ఉన్నాయి..!!ఈ విషయమై నిష్తార్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు ఓ సెక్షన్ అధికారి లేఖ రాశారు. శుక్రవారం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని () ప్రభుత్వ రంగం ఆస్పత్రి (Nishtar Hospital) అయని నిష్టర్ ఆసుపత్రిలో పైకప్పుపై కుళ్లిపోయిన మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. వెలుగులోకి వచ్చిన మృతదేహాలలో చాలా భాగాలు కూడా కనిపించలేదు. చాలా మృతదేహాలు ఛిద్రం అయిపోయి ఉండగా..మరికొన్ని మృతదేహాల నుంచి ఛాతీలు బయటపడ్డాయి. మృత దేహాల (bodies) నుంచి గుండె, ఇతర అవయవాలు బయటకు వచ్చి కనిపించి బీతావహంగా ఉన్నాయి. ఆసుపత్రి పైకప్పు నుండి బయటపడిన మృతదేహాల సంఖ్య 500 వరకు ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ ఘటనపై స్థానికులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మృతదేహాలు ఎవరివి? ఆసుపత్రి పైకప్పుపై ఇంత భారీ సంఖ్యలో మృతదేహాలు ఎక్కడ నుండి వచ్చాయి? వంటి అనేక అనుమాలు కలుగుతున్న క్రమంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.కాగా..ఈ మృతదేహాల నుంచి అవయవాలను అక్రమంగా తరలించారని అనుమానాలు వస్తుండగా అదేసమయంలో వైద్య పరీక్షల కోసం మృతదేహాల అవయవాలను విడదీసి ఉండవచ్చా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. ప్రజలు ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఆందోళన కరమైన ఘటనపై పంజాబ్ సీఎం పర్వేజ్ ఇలాహీ తీవ్రంగా స్పందించారు. దర్యాప్తుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. స్పెషలైజ్డ్ హెల్త్‌కేర్ సెక్రటరీ ముజామిల్ బషీర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ విచారణను పూర్తి చేయడానికి ఏర్పాటు చేసింది. సాథ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. కాగా మృతదేహాలకు సంబంధించి దుస్తులు పెద్ద సైజులో ఉండటాన్ని (పెద్ద సైజు ప్యాంటు)బట్టి.. మృతులు బలూచ్ కమ్యూనిటీకి చెందినట్లు అనుమానిస్తున్నారు. అయితే స్పష్టమైన సమాచారం కోసం అధికారాలు రంగంలోకి దిగారు.