Lebanon explosions (Photo Credit: X/@adityarajkaul)

Lebanon, SEP 18:  లెబనాన్‌ (Lebanon)లో మరోసారి అనూహ్య దాడులు చోటుచేసుకున్నాయి. వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే.. తాజాగా వాకీటాకీ (Walkie Talkies)లు పేలినట్లు సమాచారం. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యులు, ఓ చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.

Here's Video

 

దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హెజ్‌బొల్లా సైతం ప్రకటించింది.

Pagers Explode: లెబనాన్‌లో పేలిన పేజర్లు, 9 మంది మృతి..2800 మందికి పైగా గాయాలు, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా ప్రకటన 

వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. లెబనాన్‌, సిరియాల్లో మంగళవారం ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 2,750 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్‌ రాయబారితోపాటు హెజ్‌బొల్లా కీలక నేతలున్నారు. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్‌ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.