Alice (Photo Credits: Twitter)

Little Rock, FEB 23: అమెరికాలో విమాన ప్రమాదం (airplane crash) చోటు చేసుకుంది. నాన్-కమర్షియల్, ట్విన్ ఇంజిన్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదం అర్కాన్కాస్‌లోని పులాస్కీ కౌంటీలో చోటు చేసుకుంది. ఆర్కాన్సాస్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బిల్ మరియు హిల్లరీ క్లింటన్ జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే మధ్యాహ్నం సమయంలో ట్విన్ ఇంజిన్ల విమానం కూలిపోయింది. ఒహియోలోని కొలంబస్‌లోని జాన్‌గ్లెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి (Airport) వెళ్లే క్రమంలో ఈ విమానం ప్రమాదానికి (airplane crash) గురైంది. ఈ విమానంలో ఉన్నది లిటిల్ రాక్ ఆధారిత కన్సల్టెన్సీ అయిన సీటీఈహెచ్ ఉద్యోగులని సంస్థ తెలిపింది.

ట్విన్ ఇంజిన్ విమానం కుప్పకూలడంతో పైలట్‌తో సహా విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు లిటిల్ రాక్ (Little Rock) అధారిత పర్యావరణ సలహా సంస్థ ధృవీకరించింది. విమానాశ్రయం నుంచి కేవలం రెండు మైళ్ల దూరంలో ఈ విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశ నుంచి బలమైన గాలులతో కూడిన జల్లులు తూర్పువైపు వేగంగా కదులుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని వాతావరణ శాస్త్రవేత్త జేమ్స్ బ్రయంట్ తెలిపారు.

Surging Seas: ముంచుకొస్తున్న మృత్యువు, పెరుగుతున్న సముద్ర మట్టాలతో దేశాలకు దేశాలే సమాధి, పెరుగుతున్న సముద్ర మట్టాలపై ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆందోళన 

మధ్యాహ్నం 12.02 గంటల సమయంలో విమానం కూలిపోగా.. ఆ సమయంలో 56ఎంపీహెచ్ వేగంతో గాలి వీచినట్లు బ్రయంట్ చెప్పారు. ట్విన్ ఇంజిన్ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఫెడరల్ నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేప్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తోంది.