Newdelhi, Apr 29: స్వలింగ సంపర్క సంబంధాలు (Same Sex Relations) పెట్టుకునే వారికి ఇరాక్ ప్రభుత్వం (Iraq Government) కఠిన శిక్షలు తీసుకొచ్చింది. ఈ సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఉల్లంఘించిన వారికి 15 ఏండ్ల గరిష్ఠ కారాగార శిక్ష విధించనున్నట్టు పేర్కొంది. అలాగే వీటిని ప్రోత్సహించిన వారికి కనీసం ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు. అయితే ఇది ఎల్జీబీటీ కమ్యూనిటీపై దాడిగా హక్కుల న్యాయవాదులు ఖండించారు.
OUTRAGEOUS AND INHUMANE!
Iraq passes harsh anti-LGBTQ+ law imposing up to 15 years in prison, drawing backlash https://t.co/Og3cTLTKlf
— Leslie Sheridan - Activist for people and planet (@carpediemvoice) April 29, 2024
ఎందుకు తీసుకొచ్చారంటే??
ఇరాక్ సమాజాన్ని నైతిక పతనం నుంచి రక్షించడానికి, ప్రపంచంలో పెరిగిపోతున్న స్వలింగ సంపర్కాన్ని నిరోధించడానికి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్టు ఇరాక్ తన చట్టంలో పేర్కొంది.