Pakistan National Flag (Image used for representational purpose only) (Photo Credits: Pixabay)

90% beggars arrested abroad belong to Pakistan: విదేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థాన్‌కు చెందినవారేనని ది డాన్ నివేదించింది. పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు తరలిపోతున్నారని సెనేట్ స్టాండింగ్ కమిటీకి బుధవారం సమాచారం అందింది , ఇది "మానవ అక్రమ రవాణా"కు మరింత ఊతమిచ్చింది.దేశం విడిచి వెళ్లే నైపుణ్యం, నైపుణ్యం లేని కార్మికులు అనే అంశంపై సెనేట్ ప్యానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా విదేశీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జుల్ఫికర్ హైదర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో తొంబై శాతం పాకిస్థానీయులే ఉంటున్నట్లుగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. జేబుదొంగల్లో అత్యధికంగా పాక్ జాతీయులు ఉన్నట్లు తేలిందని తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన బిచ్చగాళ్లు భారీ సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ తెలిపారు. విదేశాల్లో అరెస్టవుతున్న వారిలో తొంబై శాతం మంది తమ దేశానికి చెందినవారే ఉన్నట్లు తెలిపారు.

దారుణం, కన్న కూతురుపై మూడు నెలల నుంచి తండ్రి అత్యాచారం, నరకయాతన తట్టుకోలేక తుపాకీతో కాల్చి చంపిన కూతురు

ఇందులో ఎక్కువమంది సౌదీ, ఇరాన్, ఇరాక్‌లకు వెళ్లేందుకు టూరిస్ట్ వీసాను ఉపయోగించుకుంటున్నట్లుగా తెలిపారు. వివిధ దేశాల్లోని పవిత్రస్థలాల్లో అరెస్టవుతోన్న జేబు దొంగల్లోను పాక్ జాతీయులే అధికమని తెలిపారు. పశ్చిమాసియా దేశాలతో పాటు ఇటీవలి కాలంలో జపాన్ కూడా పాక్ జేబుదొంగలకు గమ్యంగా మారింది. భారత్ ఓ వైపు చంద్రుడి పైకి వెళ్లే ప్రయోగాలు చేయగా, పాక్ మాత్రం ఎప్పటికప్పుడు పొరపాట్లు చేస్తోందన్నారు.

వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం.. కారణం ఇదేనా?

సౌదీలో దాదాపు 30 లక్షలు, యూఏఈలో దాదాపు 15 లక్షలు, ఖతార్‌లో 2 లక్షల మంది పాకిస్థానీలు ఉన్నారు. ఇటీవల తమ దేశం నుంచి విదేశాలకు వెళ్తోన్న యాచకుల సంఖ్య భారీగా ఉందని నివేదిక తెలిపింది. యాచకుల సంఖ్య తమ దేశానికి పెరగడం పట్ల సౌదీ, ఇరాక్ వంటి దేశాలు పాకిస్థాన్‌కు హెచ్చరికలు కూడా జారీ చేశాయని తెలుస్తోంది.