Dhaka, Feb 6: బంగ్లాదేశ్‌లోని బలియాడంగీ ఉపజిల్లా(Baliadangi Upazila)లోని 14 దేవాలయాల్లోని హిందూ దేవతల విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ధ్వంసం ( At Least 14 Hindu Temples Vandalised) చేశారని పోలీసు అధికారులు తెలిపినట్లుగా ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.యూనియన్‌లోని సిందూర్పిండి ప్రాంతంలో తొమ్మిది విగ్రహాలు, పరియా యూనియన్‌లోని కాలేజ్‌పారా ప్రాంతంలో నాలుగు, చారోల్ యూనియన్‌లోని సహబాజ్‌పూర్ నాత్‌పరా ప్రాంతంలోని ఒక ఆలయంలోని 14 విగ్రహాలను మతచాంధసవాదులు (Unidentified Persons) ధ్వంసం చేశారని డిప్యూటీ కమీషనర్ మహబూబుర్ రెహమాన్, పోలీసు సూపరింటెండెంట్ మహ్మద్ జహంగీర్ హుస్సేన్ తెలిపారు.
ఈ ఘటనపై ఠాకూర్‌గావ్ పోలీస్ సూపరింటెండెంట్ మహ్మద్ జహంగీర్ హొస్సేన్ మాట్లాడుతూ, "మేము ఈ సంఘటనలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము, విచారణ తర్వాత నిజం వెల్లడి అవుతుందన్నారు. ఈ ఘటనలు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున జరిగాయని భావిస్తున్నామని బలియాడంగి పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్ (ఓసీ) ఖైరుల్ అనమ్ తెలిపారు.కాగా, దుండగులు విగ్రహాల చేతులు, కాళ్లు, తలలను విరగ్గొట్టారని ఉపజిల్లా పూజా వేడుకల పరిషత్ ప్రధాన కార్యదర్శి విద్యానాథ్ బర్మన్ తెలిపారు. కొన్ని విగ్రహాలను పగలగొట్టి చెరువులో పడేశారు. ఈ ఘటనపై అధికారులు సక్రమంగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేయాలని కోరారు.
ఘటనా స్థలాన్ని సందర్శించి సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ మహబూబుర్ రెహమాన్ తెలిపారు. జిల్లా పూజా ఉత్సవ పరిషత్ ప్రధాన కార్యదర్శి తపన్ కుమార్ ఘోష్ సాయంత్రం 4 గంటల సమయంలో సిందూర్పిండి ప్రాంతంలోని హరిబసర్ ఆలయాన్ని సందర్శించి, ఈ ఆలయంలోని అన్ని విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. "ఇది చాలా విచారకరం, భయంకరమైనది. ఈ సంఘటనపై న్యాయమైన విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాము" అని ఆయన అన్నారు.
బలియడంగి ఉపజిల్లా పరిషత్ చైర్మన్, ఎండీ అలీ అస్లాం జ్యువెల్ మాట్లాడుతూ.. ధ్వంసం చేసిన ఆలయాల్లోని విగ్రహాలను రోడ్డు పక్కన పడేశారన్నారు. సిందూర్పిండి ప్రాంతానికి చెందిన కాశీనాథ్ సింగ్ మాట్లాడుతూ, "మేము భయాందోళనలో ఉన్నాము, ఈ సంఘటనలో పాల్గొన్న వారిని త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ధంతాలా యూనియన్ పూజా ఉజ్జపోన్ కమిటీ కార్యదర్శి జ్యోతిర్మయ్ సింగ్ డిమాండ్ చేశారు. గత 50 ఏండ్లుగా ఆలయాల్లో పూజాధికాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు.