Newdelhi, July 20: విద్యార్థులు (Students), నిరుద్యోగుల ఆందోళనలతో (Protest) అట్టుడుకున్న పొరుగు దేశం బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ఇప్పటి వరకు 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రాజధానిలో 52 మంది మృతి చెందారు. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ను నిలిపివేశారు. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. నర్సింగ్డి జిల్లాలో ఆందోళనకారులు జైలులోకి దూసుకెళ్లి ఖైదీలను విడుదల చేశారు. అనంతరం జైలుకు నిప్పు పెట్టారు.
‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు
#Bangladeshstudentsprotest: At least 105 people have been killed in the clashes so far across the country. Over 1,500 have been injured.
Read more: https://t.co/L7quKeBoG2
— Hindustan Times (@htTweets) July 20, 2024
ఎందుకీ ఆందోళనలు?
స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్ తో 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో పాల్గొన్న వారి పిల్లలు సహా కొన్ని నిర్దిష్ఠ సమాహాలకు సివిల్ సర్వీస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థకు ముగింపు పలకాలంటూ ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్నది వారి వాదన.