New Delhi, August 21: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,457 కేసులు (Covid in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది (Covid Deaths) మరణించారని వెల్లడించింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో నిన్నటికంటే 5.7 శాతం తక్కువ అని తెలిపింది.
కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ భారత్‌లో డెల్టా వేరియెంట్ కేసులు అధిక మొత్తంలో వెలుగు చూస్తున్నాయని కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సోర్టియం అయిన ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తెలిపింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయడం లేదని అంచనా వేసింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని, మరణాలు దాదాపుగా లేవని వెల్లడించింది. దేశంలో మొత్తంగా 30,230 శాంపిల్స్‌ని పరీక్షించి చూస్తే వాటిలో 20.324 డెల్టా కేసులేనని ఐఎన్‌ఎస్‌ఏసీఏజీ తాజా బులెటిన్‌లో తెలిపింది
భారత్‌లో మొదటి సారిగా వెలుగు చూసిన డెల్టా వేరియెంట్ బ్రిటన్, అమెరికాలను అతలాకుతలం చేస్తోంది. మన దేశంలోనూ సెకండ్ వేవ్ ప్రబలంగా ఉండడానికి డెల్టా వేరియెంటే కారణం. దేశంలో ఆర్ వాల్యూ 0.89కి తగ్గినప్పటికీ ప్రతీ రోజూ 30 వేలకు పైగా కేసులు నమోదు కావడానికి డెల్టా వేరియెంటే కారణమని ఆ సంస్థ వేస్తున్న అంచనాలు ఆందోళనని పెంచుతున్నాయి.