బంగ్లాదేశ్‌లో ప్యాసింజర్ రైలు మరో రైలును ఢీకొనడంతో సోమవారం 13 మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో కిషోర్‌గంజ్ నుంచి ఢాకాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు.. సరుకు రవాణా రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇప్పటివరకు 13 మృతదేహాలు లభ్యమయ్యాయని భైరబ్ రైల్వే స్టేషన్‌లోని పోలీసు అధికారిని ఉటంకిస్తూ bdnews24 నివేదించింది.దెబ్బతిన్న కోచ్‌ల కింద చాలా మంది చిక్కుకున్నారని న్యూస్ పోర్టల్ తెలిపింది. ప్రాథమిక నివేదిక ప్రకారం, సరుకు రవాణా రైలు వెనుక నుండి ఎగరో సింధూర్‌లోకి దూసుకెళ్లింది, రెండు క్యారేజీలను ఢీకొట్టింది" అని ఢాకా రైల్వే పోలీసు సూపరింటెండెంట్ అనోవర్ హుస్సేన్ చెప్పారు.