Zhejiang, Jan 24: రియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది.ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు వింత వింత ఆఫర్లతో రంగంలోకి దిగారు. చైనాలోని టియంజాన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తమ వెంచర్‌లో ఇల్లు కొంటే భార్య (Wife) ఫ్రీ అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రకటనపై చాలా మంది సీరియస్ అయ్యారు. చైనా ప్రభుత్వ అథారిటీ కూడా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ప్రకటన ఇచ్చినందుకు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది.
ఇదిలా ఉండగా జెజియంగ్ ప్రావిన్స్‌కు చెందిన మరో కంపెనీ.. ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కాగా గత రెండేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ పడిపోవడం ప్రారంభించింది.చైనాలో నాలుగు సంపన్న నగరాల్లో గృహాల ధరలు దారుణంగా పడిపోయాయి. అలాగే కొత్త ఇళ్లు విక్రయాలు కూడా తగ్గిపోయాయి. అంతేగాదు ఈ రియల్ ఎస్టేట్ తిరోగమనం మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ షెంగ్ సాంగ్‌చెంగ్ అంచనా వేశారు.