Beijing, June 16: చైనా రాజధాని బీజింగ్‌లో తాజాగా కరోనా వైరస్ కేసులు (Coronavirus Cases in Beijing) బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఆ నగరంలో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జిన్‌పాడి మార్కెట్‌లో కేసులు బయటపడిన తర్వాత.. సుమారు పది ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అయితే కోవిడ్19 కేసులు మళ్లీ పెరగడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. నగర ప్రజలందరికీ వైరస్ టెస్టింగ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కరోనాని కట్టడి చేయడం ఎలా ? రాష్ట్రాల సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో 3 లక్షల 50 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు
గత 5 రోజుల్లో బీజింగ్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 106కు చేరింది. నగరంలోని దాదాపు 30 ప్రాంతాలను లాక్‌డౌన్ చేసినట్లు ఇవాళ ఓ అధికారి తెలిపారు. బీజింగ్‌లో మహమ్మారి వల్ల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు ఆ నగర ప్రతినిధి జూ హెజియాన్ తెలిపారు. స్థానిక జింన్‌ఫాడీ మార్కెట్ తాజాగా కరోనా కేసులకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. కరోనాను అదుపులోకి తెచ్చామని ఊపిరి పీల్చుకుంటున్న చైనా.. జింన్‌ఫాడీలో కరోనా కేసులు వేలుగు చూడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓవైపు కరోనా..మరోవైపు ఎబోలా, కాంగోలో ఎబోలా వైరస్ దెబ్బకు నలుగురు మృతి, 11సార్లు కాంగోలో వ్యాధి విజృంభణ, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ
కొత్త కరోనా కేసులు మొదలైన బీజింగ్ హోల్‌సేల్ మార్కెట్‌కు ఇటీవల వెళ్లిన వారందరికీ కరోనా పరీక్షలు చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా 67 మందికి కరోనా సోకగా, ఇందులో 42 మంది రాజధాని బీజింగ్‌కు చెందిన వారే. ఇప్పటివరకూ చైనాలో మొత్తంగా 83181 మందికి కరోనా (China Coronavirus) సోకగా, 4,634 మంది మరణించారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్ నగర విస్తీర్ణం, జనాభా, దేశంలోని ఇతర ప్రాంతాలతో నగరాన్ని కున్న సంబంధం వంటివాటి దృష్ట్యా ప్రభుత్వం అక్కడి పరిస్థితిని తక్షనం అదుపులోకి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
కోవిడ్–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్ బయోటెక్ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్’టీకా మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి దశలో 600 మంది వాలంటీర్లు తమ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో 90% కన్నా ఎక్కువ మందిలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది. వారిలో తీవ్రస్థాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కనిపించలేదని పేర్కొంది.
గత రెండు వారాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. అమెరికాతో పాటు దక్షిణాసియా దేశాల్లో అత్యధిక స్థాయిలో కేసులు నమోదు అవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ టెడ్రోస్ తెలిపారు. వైరస్‌ను నియంత్రించిన దేశాలు రెండో దఫా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 78 లక్షలు, మరణాల సంఖ్య 4 లక్షల 31 వేలు దాటింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 1,32,581 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ప్రపంచంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78,23,289కి చేరింది.
మొత్తం కేసులలో అగ్రరాజ్యం అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 37 లక్షలకుపైగా పాజిటివ్ కేసులతో కరోనా మహమ్మారికి ప్రధాన కేంద్రంగా ఆ దేశం కొనసాగుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు కూడా రోజురోజుకు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,911 మంది కరోనా రోగులు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 4,31,541కి చేరింది.