
Beijing, August 30: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్ రెస్టారెంటు కుప్పకూలిన ఘటన (China Restaurant Collapse) విషాదాన్ని నింపింది. లిన్‌ఫెన్ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బీజింగ్‌కు 630 కిలోమీటర్ల దూరంలోని షాంకి ప్రావిన్స్‌లోని జియాంగ్‌ఫెన్ (Shanxi Province) కౌంటీలో గల రెండంతస్తుల రెస్టారెంట్‌లో ఒక వ్యక్తి 80వ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా శనివారం అది కూలిపోయింది. వెంటనే వందలాది మంది రెస్క్యూ సిబ్బంది, డాగ్స్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించారు. ఆదివారం నాటికి రెస్క్యూ ఆపరేషన్ ముగించారు.
శనివారం ఉదయం 9.40 నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో (Chinese Restaurant Collapse) మృతుల సంఖ్య 29కి చేరింది. రెండంతస్థుల భవనం శిథిలాల కింద నుంచి 59 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 21 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా నుంచి కోలుకున్న వుహాన్, సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు,కాలేజీలు ప్రారంభం, విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు
ఆదివారం ఉదయం సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఇంకా గుర్తించలేదన్నారు. కాగా ప్రమాదం జరిగిన రోజు ఆ రెస్టారెంటులో 80 ఏళ్ల వ్యక్తి బర్త్‌డే పార్టీ జరుపుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేడుకకు ఎక్కువమంది హాజరవడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. భవనం కూలిపోవడానికి కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు. ఈ రెస్టారెంట్ ఎలా కూలిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బొగ్గు గనులున్న ఈ ప్రాంతంలో గతంలో పేలుళ్లు, వరదలు, గనులు కూలిన ఘటనల్లో వేలాది మంది మరణించారు.