Taishan Nuclear Power Plant: ప్రపంచానికి చైనా మరో ముప్పును తీసుకువస్తోందా? అణుశక్తికేంద్రంలో భారీ ఎత్తున రేడియేషన్‌ లీకేజీ, అనుమానాస్పద పరిస్థితుల్లో అణుశాస్త్రవేత్త మరణం, వార్తలను కొట్టివేస్తున్న చైనా
Flag of China (photo Credits: PTI)

Beijing, June 22: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు పుట్టినిల్లుగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలో మరోసారి అనుమానాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల చైనాలో ఒక అణుశక్తికేంద్రంలో భారీ ఎత్తున రేడియేషన్‌ లీకేజీ చోటుచేసుకోగా, దీని ప్రభావం తీవ్రంగా ఉండనుందని వార్తలు వెలువడ్డాయి. అయితే చైనా ప్రభుత్వం ఆ వార్తలను కొట్టివేసింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ దేశానికి చెందిన అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్త మరణానికి, అణు లీకేజీ ఘటనకు సంబంధం ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.

గత వారం రోజుల క్రితం చైనాలోని తాయ్‌షాన్‌ అణుశక్తి కేంద్రంలో ( Taishan Nuclear Power) ఇటీవల ఐదు ఫ్యూయల్‌రాడ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తోపాటు పలువురు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనాలోని ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ఝాంగ్‌ ఝిజియాన్‌ ఈ నెల 18న ఓ ఎత్తయిన భవనంపైనుంచి పడి మరణించారు. ఆయన మరణించటానికి రెండు రోజుల ముందే హార్బిన్‌ యూనివర్సిటీ వీసీగా మరో అణుశాస్త్రవేత్త జింగ్వీని నియమించారు. వరుసగా సంభవించిన ఈ పరిణామాల మధ్య బయటపడని ఏదో లింక్‌ ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇది మరో షాక్ లాంటి వార్తే.. సైన్స్‌లో అత్యుత్తమ అవార్డుకు ఎంపికైన వుహాన్ ల్యాబ్‌, ప్రత్యేక అభినందనలు అందుకున్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్ షి జెంగ్లీ, వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయిందంటూ ఇప్పటికీ వినిపిస్తున్న వార్తలు

కాగా అణు విద్యుత్ కేంద్రం చుట్టూ రేడియేషన్ వాతావరణంలో అసాధారణత లేదు. దీని భద్రతకు భరోసా ఉంది" అని విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ బీజింగ్‌లో ఒక వార్తా సమావేశంలో చెప్పారు. నివేదికపై స్పందిస్తూ, జావో మాట్లాడుతూ, తైషాన్ ప్లాంట్ అన్ని సాంకేతిక అవసరాలకు పూర్తిగా అనుగుణంగా (China Says Radiation Levels Normal) ఉందని అన్నారు. అణు భద్రతకు చైనా చాలా ప్రాముఖ్యతనిస్తుంది మరియు అంతర్జాతీయ ప్రమాణాలు మరియు జాతీయ పరిస్థితులకు అనుగుణంగా అణు భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది" అని ఆయన చెప్పారు.