Marathon (Photo Credits: Pixabay)

Beijing, May 23: చైనా మారథాన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. అక్కడి మారథాన్ పై అతిచల్లని వర్షాలు, వడగండ్లు ప్రాణ గండంలా మారి 21 మందిని (Severe Weather Kills 21 Participants) బలి తీసుకున్నాయి. ఈశాన్య చైనా హువాంగే షిలిన్‌ పర్వతాల దగ్గర గల గన్షూ ప్రావిన్స్ లోని (Marathon Race in Gansu Province) బయాన్ కు సమీపంలో ఉన్న ఎల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ లో జరుగుతున్న వంద కిలోమీటర్ల క్రాస్ కంట్రీ మౌంటెయిన్ రేస్ సాగుతోంది. అప్పటిదాకా ఎండగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి.

హవాంగే పర్వత ప్రాంతంలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ (100-km Cross-Country Mountain Marathon Race) మొదలైంది. ఆ టైంలో వాతావరణం పొడిగా ఉంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట టైంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, చలి తీవ్రత పెరిగిపోవడం, ఉన్నట్లుండి వడగళ్ల వానతో మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. యెల్లో రివర్‌ స్టోన్‌ఫారెస్ట్‌ వెంట పరుగులు తీస్తున్న వాళ్లలో చాలామంది హైపోథెర్మియాకు గురయ్యారు. చాలామంది కనిపించకుండా పోయారు. దీంతో పోటీని ఆపేసిన నిర్వాహకులు.. సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు.

కుప్పకూలిన ప్రపంచ పర్యాటక ప్రదేశం, రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తున్న డార్విన్‌ ఆర్చ్‌, సముద్రపు నీటి మధ్యలో ఉన్న రాతి కట్టడం కూలిపోయిందని తెలిపిన ఈక్వెడార్‌ పర్యావరణ మంత్రిత్వ శాఖ

మొదట 20 మంది చనిపోయారని, ఒకరు గల్లంతయ్యారని చెప్పింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టగా.. ఉదయం 9.30 గంటలకు మృతదేహం లభించిందని పేర్కొంది. ఒక్కసారిగా భారీ వర్షాలు విరుచుకుపడ్డాయని చైనా జాతీయ మీడియా వెల్లడించింది. మారథాన్ లో 172 మంది పాల్గొనగా.. 18 మందిని కాపాడగలిగినట్టు ప్రకటించారు. ప్రస్తుతం మిగతా వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

వీళ్ల ఆచూకీ కోసం 1200 రెస్క్యూ టీంలుగా ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం కల్లా 151 మందిని సురక్షితంగా కాపాడగా, వీళ్లలో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 21 మంది చనిపోయారని రెస్క్యూ టీం వర్గాలు వెల్లడించాయి. వీళ్లంతా చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు. మారథాన్‌లో పాల్గొన్నవాళ్లు షార్ట్స్‌ ,టీషర్ట్స్‌ ధరించడం కూడా వాళ్ల మృతికి ఒక కారణమైందని అధికారులు అంటున్నారు.

అతి శీతల వాతావరణం కారణంగా చాలా మంది రన్నర్ల శరీర ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయని చెబుతున్నారు. కాగా, గన్షూ ప్రావిన్స్ ప్రకృతి పరంగా అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. గతంలో అక్కడ భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడిన దాఖలాలను స్థానికులు వివరిస్తున్నారు. 2010లో వచ్చిన బురద వరద వల్ల ఒకే పట్టణంలో వెయ్యి మంది చనిపోయారని చెబుతున్నారు. అంతేగాకుండా ఆ ప్రాంతం భూకంప ప్రమాద జాబితాలోనూ ఉందంటున్నారు.