Chinese President Xi Jinping (Photo Credits: Getty Images)

Beijing, Sep 28: చైనాలో సైనిక కుట్ర అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ మంగళవారం జనంలో (Xi Jinping appears in public) ప్రత్యక్షమయ్యారు.వ‌చ్చేనెల 16 నుంచి చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌ను మంగ‌ళ‌వారం ఆయ‌న ప్రారంభించారు.

కాగా ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే.ఎస్సీవో స‌ద‌స్సు త‌ర్వాత బాహ్య ప్ర‌పంచంలోకి రావ‌డం (1st time after coming from SCO summit) ఇదే తొలిసారి.

రష్యా జైలు నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుడు ఫోటో వైరల్, ఎంత దారుణంగా ఉన్నాడంటే..

దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్‌ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్‌ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది.

కాగా చైనాలో కొవిడ్‌-19 జీరో పాల‌సీలో భాగంగా విదేశాల నుంచి వ‌చ్చిన వారు వారం పాటు త‌ప్ప‌నిస‌రి క్వారంటైన్‌లో ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి. త‌ర్వాత మూడు రోజుల పాటు ఇంట్లోనే బ‌స చేయాలి.జీరో కోవిడ్‌ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్‌ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఐదేండ్ల‌కోసారి జ‌రిగే చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సులో మూడో ద‌ఫా చైనా అధ్య‌క్షుడిగా జీ జిన్‌పింగ్‌ను నియ‌మించ‌డానికి రంగం సిద్ధ‌మైంద‌ని స‌మాచారం. ఈ నెల 16 నుంచి జ‌రిగే ఈ స‌ద‌స్సుకు ఎంపిక చేసిన 2,300 మంది డెలిగేట్స్‌లో జీ జిన్‌పింగ్ కూడా ఉన్నారు. వ‌చ్చే నెల‌లో జీ జిన్‌పింగ్‌ను అధ్య‌క్షుడిగా కొన‌సాగిస్తారా..ఆయ‌న స్థానంలో లీ కియామింగ్‌ను నియ‌మిస్తారా? అన్న అంశంపై స‌స్పెన్ష‌న్ కొనసాగుతున్న‌ది.