Coronavirus Pandemic: యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా కల్లోలం, ఒక్కసారిగా పెరిగిన కేసులు, మరణాలు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Coronavirus in India (Photo-PTI)

Geneva, Nov 12: పలు దేశాల్లో తగ్గుముఖం పట్టిన కోవిడ్ తాజాగా యూరప్ దేశాలను మళ్లీ వణికిస్తున్నది. వరుసగా గత ఆరు వారాల్లో వైరస్‌ (Coronavirus Pandemic) కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన వారంలోనే కరోనా మరణాలు 10 శాతం పెరిగినట్టు డబ్ల్యూహెచ్‌వో (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, రష్యా, టర్కీ తదితర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, మరణాల శాతం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.

అయితే యూరప్ (Europe) దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఉక్రెయిన్‌, డెన్మార్క్‌, స్లొవేకియా, చెక్‌ రిపబ్లిక్‌, బల్గేరియాలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. కేసుల పెరుగుదలతోపాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. యూరప్ ప్రాంతం కరోనా విజృంభణకు కేంద్రంగా మారుతున్నదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ డాక్టర్‌ హన్స్‌ క్లుజ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జర్మనీ సహా పలు దేశాల్లో ఉచిత కరోనా పరీక్షలను నిలిపేశారు. అక్కడ ఒక్కో టెస్టుకు రూ.1700 వసూలు చేస్తున్నారు. దీంతో లక్షణాలు ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవడంలేదు.

చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, లాక్‌డౌన్ మొదలు పెట్టిన యంత్రాంగం, పలు సిటిమాల్స్ మూసివేత, కరోనా పరీక్షలను ముమ్మరం చేసిన వైద్యారోగ్యశాఖ

ఫలితంగా బాధితులను గుర్తించడంలో అధికారులు వెనుకబడుతున్నారు. టీకా వేసుకోవడంలో ప్రజలు అలసత్వం ప్రదర్శించడం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగడం కూడా ఈ పెరుగుదలపై ప్రభావం చూపించింది. కరోనా వ్యాక్సిన్లు తొలిసారిగా ఐరోపా దేశాల్లోనే అందుబాటులోకి వచ్చాయి.

కరోనావైరస్ పిఫ్త్ వేవ్ ముంచుకొస్తోంది, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఫ్రెంచ్‌ ఆరోగ్యమంత్రి ఆలివర్‌ వెరాన్‌

టీకా వేసుకొని చాలాకాలం కావడంతో యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఐరోపాలో నాలుగో దశ ప్రారంభమైందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయడం, టెస్టులను పెంచడం, ఆంక్షలను మళ్లీ కఠినతరం చేయడంతోనే వైరస్‌కు కళ్లెం వేయొచ్చని సూచిస్తున్నారు.