
Geneva, Jan 26: గత వారం ప్రపంచ వ్యాప్తంగా 21 మిలియన్ల కరోనా కేసులు (Coronavirus Scare) నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల్లో ఐదు శాతం పెరుగుదల కనిపించిదని తెలిపింది. వారం వ్యవధిలొ ఈ స్థాయిలో కోవిడ్ కేసులు (Over 21 million new Covid-19 cases) నమోదు కావడం, కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారి. ప్రతివారం ఇచ్చే నివేదికలొ భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) తాజా గణాంకాలను వెల్లడించింది. అదే వారంలో దాదాపు 50 వేల మరణాలు సంభవించానయని తెలిపింది.
జనవరి 23 వరకు 34 కోట్లకు పైగా కేసులు, 55 లక్ోషలకు పైగా మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ రెండు కోట్ల కేసుల్లో అమెరికా, ఫ్రాన్స్, భారత్, ఇటలీ, బ్రెజిట్ దేశాల్లోనే ఎక్కువగా ఉందని తెలిపింది. మరణాల పరంగా అమెరికా, రష్యా, భారత్, యూకే ముందు వరసలో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరంగా మారుతోందని అనేక దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ సమూహ వ్యాప్తిని నివేదిస్తున్నాయని WHO వెల్లడించింది.
ఈ కొత్త వేరియంట్ కారణంగా నవంబర్, డిసెంబర్ లో భారీ స్థాయిలో కేసులు చవిచూసిన దేశాల్లో ఇప్పుడు తగ్గుదల ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ వెలుగు చూసిన తర్వాత ఐరోపా దేశాల్లో దాని ప్రభావం తీవ్రంగా కనిపించింది. అగ్రదేశం అమెరికా విలవిలలాడిపోయింది. ఇప్పుడిప్పుడే కాస్తా వైరస్ నుండి కోలుకుంటున్నాయి.