raccoon dogs (Photo-IANS)

Wuhan, Mar 19: చైనా నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. సెంట్రల్ చైనాలోని వుహాన్ నగరంలోని సీఫుడ్ మార్కెట్ నుండి సేకరించిన జన్యు నమూనాల కొత్త విశ్లేషణ వేదిక వద్ద విక్రయించే రక్కూన్ కుక్కలలో SARS-CoV-2 వైరస్ ఉనికిని (Covid Found in Raccoon Dogs) కనుగొన్నారు. ఇది సహజ మూలానికి సంబంధించిన కేసును బలపరుస్తుంది. వాటి నుంచి ఇతర జంతువులకు లేదా మనుషులకు సోకి ఉండవచ్చునని లేదా వేరే జంతువుల నుంచే రకూన్‌ కుక్కలకు వైరస్‌ సోకి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

న్యూయార్క్‌ టైమ్స్‌’ తాజా వార్తా కథనం ప్రకారం.. జనవరి 2020లో వుహాన్‌లోని చేపల మార్కెట్‌ నుంచి సేకరించిన ‘స్వాబ్స్‌’ ఫలితాలను యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా, ఉటా, సిడ్నీ, స్క్రిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు విశ్లేషించారు. అక్కడ నుంచి వైరస్ బయటకు వచ్చిందని తెలియగానే వుహాన్‌లోని చేపల మార్కెట్‌, కృత్రిమ వైరస్‌పై పరిశోధనలు జరిపిన ల్యాబ్‌ను చైనా మూసేసింది.తాజాగా చేపల మార్కెట్‌లోని గోడలు, నేల, జంతువుల్ని తరలించే పరికరాల నుంచి శాంపిల్స్‌ సేకరించి విశ్లేషించారు.

మళ్లీ వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్‌, నాలుగో వేవ్ తప్పదనే భయాలు, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

రకూన్‌ కుక్కల నుంచి సేకరించిన జన్యు సమాచారానికి, వైరస్‌ మూల కణానికి దగ్గరి పోలికలున్నాయి. వుహాన్‌ మార్కెట్‌ నుంచి వచ్చిన జన్యు సమాచారంలో వైరస్‌ ఆనవాళ్లు కచ్చితంగా ఉన్నాయి. అయితే వుహాన్‌ ల్యాబ్‌, చేపల మార్కెట్‌ జంతువుల జన్యు సమాచారం ఏ కాలం నాటిది అన్నది తెలియాల్సి ఉన్నది’ అని యూనివర్సిటీ ఆఫ్‌ ఉటాకు చెందిన వైరాలజిస్ట్‌ స్టీఫెన్‌ గోల్డ్‌స్టెయిన్‌ తెలిపారు.

కరోనా ఇంకా పోలేదు, ఒమిక్రాన్ ఉపవేరియంట్ XBB.1.5తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

రకూన్‌ కుక్కల నుంచి నేరుగా మనుషులకు సోకిందనటానికి ఆధారాల్లేవని, ఆ కుక్క నుంచి వైరస్‌ మరో జంతువులోకి ప్రవేశించి, ఆ తర్వాత మనుషులకు ప్రబలి ఉండొచ్చునని నిపుణులు బృందం తెలిపింది. ఆ కుక్కల జన్యు సమాచారంలో గుర్తించిన వైరస్‌కు, అక్కడి మనుషుల కొవిడ్‌ వైరస్‌ నమూనాలకు దగ్గరి పోలికలున్నాయని పేర్కొన్నది. విశ్లేషణ ప్రకారం, రక్కూన్ కుక్కలు - నక్కలకు సంబంధించిన మెత్తటి జంతువులు కరోనావైరస్ను ప్రసారం చేయగలవు.

డిసెంబర్ 2019లో చైనాలోని వుహాన్ ప్రావిన్స్‌లో మొదటి కరోనావైరస్ కేసు నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 760,360,956 COVID-19 కేసులు నమోదయ్యాయి, ఇందులో 6,873,477 మంది మరణించారు