Beijing, Nov 18: చైనాలో కరోనా వైరస్ కల్లోలం (Covid in China) రేపుతోంది. నియంత్రించేందుకు ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఒక్క కేసు బయటపడినా ప్రావిన్స్ వ్యాప్తంగా ఆంక్షలు (Coronavirus restrictions) విధిస్తూ పోతోంది. ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడగానే జీరో కొవిడ్ విధానాన్ని బాధితులను క్వారంటైన్ చేస్తూ బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ జీరో కోవిడ్ విధానం వల్ల క్వారంటైన్‌లో ఉన్న చిన్నారులకు అత్యవసర సమయంలో చికిత్స అందడం లేదు. దీంతో పిల్లలు మృత్యువాత పడుతున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరీ ఇంత కఠినంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. స్థానిక అధికారులపై తిరగబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా నగరానికి దూరంగా ఓ హోటల్‌లోని క్వారంటైన్‌లో గడుపుతున్న ఓ కుటుంబంలోని నాలుగు నెలల చిన్నారి అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో అత్యవసర వైద్య సదుపాయం (baby died due to delayed treatment) కోసం ప్రయత్నించారు. అయితే, కరోనా ఆంక్షల నేపథ్యంలో వారిని బయటకు పంపేందుకు అధికారులు అంగీకరించలేదు. పాప పరిస్థితి క్రమంగా దిగజారుతుండడంతో 11 గంటలపాటు ప్రాధేయపడిన తర్వాత 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి పాపను తీసుకెళ్లేందుకు ఆ కుటుంబానికి అధికారులు అనుమతిచ్చారు. అయితే, ఆ చిన్నారి పరిస్థితి అప్పటికే విషమించడంతో మృతి చెందింది.
Here's Zero Covid rules Videos
Tyrannical enforcement of China's Zero COVID policy pic.twitter.com/kZs7DSOiUn
— Prashant Dhawan (@DhawanPrasant) November 7, 2022
China 🇨🇳
Zero Covid rules.pic.twitter.com/BGRexGFPM2
— James Melville (@JamesMelville) November 1, 2022
ఈ ఘటనతో పాటు మరో ఘటన లాంఝువాలో జరిగింది. క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల బాలుడు అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. దీంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. అధికారుల తీరును నిరసిస్తూ రోడ్లపైకి వచ్చి బారికేడ్లను తొలగించారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు క్వారంటైన్‌లో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలిగించబోమని హామీ ఇచ్చారు.