COVID in China: చైనాలో దారుణ పరిస్థితులు, ఒక్కరికి కరోనా వచ్చిందని వేలమందిని బలవంతంగా క్వారంటైన్‌ చేసిన అధికారులు
COVID-19 in China

Beijing, May 31: చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ దేశాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ (COVID in China) వణికిస్తున్నది. దీంతో రాజధాని బీజింగ్‌లో గత ఐదు వారాలుగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ కఠిన ఆంక్షలను ప్రవేశపెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఓకేసును పరిశీలిస్తే అర్థం అవుతుంది. బీజింగ్ లో క్వారంటైన్‌ నుంచి తప్పించుకుని నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వ్యక్తికి (Beijing man breaks COVID rules) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో పొరుగున నివసించే వేలాది మందిని అధికారులు బలవంతంగా క్వారంటైన్‌ (lands thousands of neighbors in quarantine) చేశారు.

40 ఏళ్ల వ్యక్తి హోమ్‌ ఐసొలేషన్‌ నిబంధనలను ఉల్లంఘించాడు. కరోనా హైరిస్క్‌ జోన్‌గా ప్రకటించిన ఒక షాపింగ్‌ సెంటర్‌కు అతడు వెళ్లాడు. అలాగే తన ఇంటి చుట్టుపక్కల తిరిగాడు. ఆదివారం ఆ వ్యక్తి కుటుంబానికి కరోనా పరీక్ష నిర్వహించగా అతడితోపాటు భార్యకు పాజిటివ్‌గా తేలింది. దీంతో పొరుగున ఉన్న ఐదు వేల మంది ప్రజలను నిర్బంధ హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. 250 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు, మరో 19 మంది మహమ్మారి బారినపడి మృతి

ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కాగా, బీజింగ్‌లో కరోనా కేసులు తగ్గుతుండటంతో సోమవారం నుంచి ఆంక్షలను సడలించారు. ఆఫీసులు, బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. సూపర్‌ మార్కెట్లు, సినిమా థియేటర్లు, పార్కులు, మ్యూజియంలను తెరిచారు. అయితే వీటిలో ప్రవేశంతోపాటు బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు కరోనా నెగిటివ్‌ రిపోర్ట్‌ను తప్పనిసరి చేశారు. మరోవైపు బీజింగ్‌లో స్కూళ్ల మూసివేత ఇంకా కొనసాగుతున్నది.