
Berlin, June 02: రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు (Ukraine)అధునాతన, ఆధునిక హైటెక్ ఆయుధాలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Joie biden)ప్రకటించారు. అయితే ఆ ఆయుధాలను కేవలం యుక్రెయిన్ భూభాగంలోకి వచ్చిన రష్యా బలగాలపైనే వాడాలని, రష్యా భూభాగంలోకి ప్రయోగించరాదని అమెరికా షరతు విధించింది. అమెరికా చేసిన ఈ ప్రకటనను తప్పుబట్టిన రష్యా అధికారులు, అమెరికా (America)..యుక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం వలన రష్యా – అమెరికా మధ్య ప్రత్యక్ష పోరుకు నాంది పలికినట్లు అవుతుందని రష్యా విదేశాంగ ఉప మంత్రి సెర్గీ రియాబ్కోవ్ అన్నారు.
బుధవారం ఆర్ఐఎ నోవోస్టి వార్తా సంస్థతో సెర్గీ రియాబ్కోవ్ మాట్లాడుతూ ” యుక్రెయిన్‌కు ఆయుధ సరఫరాలు పెరుగుతున్నాయని, అటువంటి చర్యలు ప్రమాద తీవ్రతను మరింత పెంచుతాయి” అని అన్నారు. యుక్రెయిన్‌కు బహుళ ప్రయోగ రాకెట్ వ్యవస్థల (multiple launch rocket systems)ను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంగీకరించారు.
డాన్బాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమణలను (Russia) అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైన్యాధికారుల విజ్ఞప్తి మేరకు కీలక ఆయుధంగా భావిస్తున్న ఈ హైటెక్, మీడియం రేంజ్ రాకెట్ వ్యవస్థలను యుక్రెయిన్‌కు పంపనున్నట్లు బైడెన్ ప్రకటించారు. కాగా, గత మూడు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ రష్యాపై పోరాడేందుకు గానూ అమెరికా ఇప్పటికే భారీ ఆర్ధిక సహాయం అందించింది.
మొత్తం $ 700 మిలియన్ డాలర్ల భద్రతా సహాయంలో భాగంగా హెలికాప్టర్లు, జావెలిన్ యాంటీ ట్యాంక్ ఆయుధ వ్యవస్థలు, యుద్ధ వాహనాలు, విడిభాగాలు మరియు కొత్త రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి. మరోవైపు యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరాను పెంచవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జర్మనీ, ఫ్రాన్స్ నాయకులను హెచ్చరించారు.