Washington, December 22: రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూకంపం (Alaska Coast Earthquake) అలస్కా తీరంలో భూకంపం నమోదైందని US జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. పోర్ట్ అల్స్‌వర్త్ నగరానికి తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో 152.6 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు USGS మంగళవారం సాయంత్రం తెలిపింది. తీరం లేదా లోతట్టు ప్రాంతాలలో వస్తు నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు ఇప్పటివరకు నివేదించబడలేదు.
ఇక అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 6.2గా (Earthquake of Magnitude 6 Strike) ఉంది. అయితే ఈ భూకంపం రావడానికి కొన్ని 10 సెకన్ల ముందు దాదాపు 5 లక్షల మంది మొబైల్ ఫోన్లకు వార్నింగ్ వచ్చింది. అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే (US Geological Survey) అభివృద్ధి చేసిన అలర్ట్ సిస్టమ్‌తో స్థానికులు ముందే జాగ్రత్త పడ్డారు. భూకంపం రావడానికి కొన్ని క్షణాల ముందు స్వల్పంగా భూమి షేక్ అవుతుంది. అయితే ఆ సమయంలో మొబైల్ ఫోన్లకు వార్నింగ్ వచ్చేలా యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ యాప్‌ను డెవలప్ చేసింది. ఈ షేక్అలర్ట్ అనే వార్నింగ్ వ్యవస్థతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. కాలిఫోర్నియాలోని హంబోల్డ్ కౌంటీలో ఈ వ్యవస్థను వాడడం వల్ల నష్టాన్ని చాలా వరకు తగ్గించారు.
షేక్అలర్ట్ వార్నింగ్ సిస్టమ్‌తో మైషేక్‌యాప్‌కు సంకేతాలు వెళ్తాయి. పబ్లిక్ వైర్‌లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్స్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు కూడా భూకంప సంకేతాలు వెళ్తాయి. యూఎస్జీఎస్ సెన్సార్ల ద్వారా వచ్చిన సమాచారం సెకన్లలో మొబైల్ ఫోన్లలో ఉన్న అలర్ట్ యాప్‌లకు వెళ్తుంది. భూకంపానికి చెందిన అలర్ట్ రావడంతో ప్రజలు అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉంటాయి. భూకంపం వచ్చిన హంబోల్డ్ కౌంటీలో ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచారు. అయితే అలర్ట్ వ్యవస్థను కేవలం హంబోల్డ్ ప్రాంతంలో టెస్ట్ చేశారు. భూకంపం వల్ల ఆ ప్రాంతంలోని ఓ వైన్ స్టోర్‌లో ఉన్న బాటిళ్లు కిందపడ్డాయి. భూకంపం తర్వాత పలుమార్లు స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు అయ్యాయి. కానీ యూఎస్జీఎస్ మాత్రం ఎటువంటి సునామీ ఆదేశాలు ఇవ్వలేదు. భూకంప జోన్‌లో ఉన్న వాళ్లు ముందస్తు వార్నింగ్ వ్యవస్థలను కలిగి ఉండాలన్న సంకేతాలను షేక్అలర్ట్ స్పష్టం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.