Errol Musk: నా వీర్యం ద్వారా భూమిపై జనాభాను పెంచడానికే నేను ఉన్నా, ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
Elon Musk's father and stepsister are a couple! (Photo Credits: Musk, Errol Musk and Jana Bezuidenhout/Facebook)

New Delhi, July 20: ప్రపంచ కుబేరుడైన టెస్లా అధినేత, ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ (76) (Elon Musk's dad Errol Musk) తాజాగా సంచలన విషయాలు బయట పెట్టారు. కొత్త తరం ఎలాన్ లను (create new generation of Elons) తయారు చేయడానికి వీలుగా తన వీర్యాన్ని దానం చేయాలని పలువురు కోరినట్టు ఎర్రోల్ మస్క్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కొలంబియాకు చెందిన ఓ కంపెనీ నన్ను సంప్రదించింది. కొలంబియాకు చెందిన ఓ ఉన్నత తరగతి మహిళ గర్భం దాల్చేందుకు వీర్యం దానం (donate sperms to create new generation) చేయాలని కోరింది.

ఎలాన్ (మస్క్) వద్దకు వెళ్లడం ఎందుకు, ఆయన్ను సృష్టించిన అసలు వ్యక్తి ఉన్నప్పుడు?’ అని వారు నాకు చెప్పారు’’ అంటూ ఎర్రోల్ మస్క్ ఆ విషయాన్ని బయటపెట్టారు. వీర్య దానం చేసినందుకు డబ్బులు చెల్లించే విషయాన్ని మాత్రం వారు తనకు చెప్పలేదన్నారు. వారు చెప్పిన దానికి అంగీకరిస్తే తనకు ఇతర ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. ఫస్ట్ క్లాస్ ఫ్లయిట్ ప్రయాణం, 5 స్టార్ హోటల్ లో విడిది, ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు ఆయన తెలిపారు. ఈ కోరికలను మన్నిస్తారా? అని ప్రశ్నించగా.. తనకు మరో చిన్నారి కావాలని అనిపిస్తే చేస్తానని, చేయకుండా ఉండేందుకు ఏ కారణం కనిపించడం లేదని ఎర్రోల్ మస్క్ బదులిచ్చారు.

ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఎలాన్ మస్క్ అర్థ నగ్న ఫోటోలు, ప్రపంచ కుబేరుడిని షర్ట్ లేకుండా చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం తన పెంపుడు కుమార్తె జానా బెజుడెన్‌హౌట్‌తో మరోసారి తండ్రినయ్యానంటూ ఎర్రోల్ ఇటీవలే వార్తల్లో నిలిచారు. ప్రపంచ సంతానోత్పత్తి రేటు తగ్గే అవకాశం ఉందంటూ వాషింగ్టన్ యూనివర్సిటీ ఓ డేటాను విడుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎర్రోల్‌ మస్క్‌ మాట్లాడుతూ..తగ్గిపోతున్న జనాభాకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. మనం ఈ భూమిపై ఉన్నది పునరుత్పత్తి కోసమే. అందుకే జానాతో తొలిసారి 2017లో అబ్బాయి ఎలియట్ రష్‌కు, 2019లో పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు.

ట్విట్టర్ కొనుగోలు చేయడం లేదంటూ షాకిచ్చిన ఎలన్ మస్క్, న్యాయపోరాటానికి దిగిన ట్విట్టర్, ఒక్కసారిగా సోషల్ మీడియా దిగ్గజం షేర్లు ఢమాల్

ఎలన్ మస్క్ కు త‌న తండ్రి ఎర్రోల్ మ‌స్క్ అంటే అస్స‌లు న‌చ్చ‌దు. సౌతాఫ్రికాలో బిజినెస్ మ్యాన్ గా ఉన్న ఎర్రోల్ అత్యంత క్రూరుడు. శారీర‌క సుఖ కోసం ఎంత‌కైనా తెగిస్తాడు. ఎర్రోల్ తొలిసారి ఎలన్ మ‌స్క్ త‌ల్లి మేయ‌ల్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ త‌రువాత మేయ‌ల్‌కు విడాకులిచ్చి అప్ప‌టికే పెళ్లై 10ఏళ్ల కూతురున్నహెడీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత రెండో భార్య హెడీకి విడాకులిచ్చి ఆమె కూతురు జానాను వివాహం చేసుకున్నాడు. ఎర్రోల్‌, జానా దంప‌తులు అబ్బాయి, అమ్మాయికి జ‌న్మ‌నిచ్చారు. కాగా, రెండో భార్య కుమార్తె జానాకు ఎలన్ మ‌స్క్ తండ్రి ఎర్రోల్ మ‌స్క్ వ‌య‌స్సు వ్య‌త్యాసం 40ఏళ్లు.