England: వద్దని ఏడ్చినా వినని కామాంధుడు, 99 ఏళ్ళ బామ్మపై దారుణంగా అత్యాచారం, నిందితుడికి యావ‌జ్జీవ ఖైదు విధించిన ఇంగ్లండ్ ప్రిస్ట‌న్ క్రౌన్ కోర్టు
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Blackpool, Feb 10: ఇంగ్లండ్ లోని Blackpoolలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ‌య‌సుతో పాటు వావివ‌ర‌స‌ల‌ను మ‌రిచిన ఓ కామాంధుడు ఏకంగా 99 ఏళ్ళ బామ్మపై అత్యాచారానికి తెగబడ్డాడు. బ్లాక్‌పూల్ లాంకాషైర్‌లో బామ్మ బాగోగులు చూసేందుకు ప‌నిలో కుదిరిన కేర్‌గివ‌ర్ (Care worker) వృద్ధురాలిపై ఈ లైంగిక దాడికి (Rape on 99 years old lady by care taker) పాల్ప‌డ‌టం షాక్ కు గురి చేసింది. ఆ వృద్ధురాలి రూంలో ఆమె కుటుంబ స‌భ్యులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దారుణం రికార్డు కావ‌డంతో నిందితుడు ఫిలిప్ క్యారీ వారికి రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

కామాంధుడు (Blackpool care home worker) కేర్ హోంలో వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో ప్రిస్ట‌న్ క్రౌన్ కోర్టులో నేరం అంగీక‌రించ‌డంతో ఫిలిప్‌కు న్యాయ‌స్ధానం యావ‌జ్జీవ ఖైదు (Life sentence) విధించింది. కేర్ హోంలో అరాచ‌కాల‌పై బాధితురాలు కుటుంబ స‌భ్యుల‌కు వివ‌రించి త‌న‌ను వ‌దిలివెళ్ల‌వ‌ద్ద‌ని ఆమె ప్రాధేయ‌ప‌డింది. దీంతో కేర్ హోంలో వారు సీక్రెట్ కెమెరాల‌ను అమ‌ర్చినా వారు భ‌య‌ప‌డినంతా జ‌రిగింది.

ముంబైలో కామాంధుడి దారుణం, ఎయిడ్స్ ఉందని తెలిసినా కూతురిపై అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక

క్యారీ ఫిలిప్ వృద్ధురాలి గ‌దిలోకి వ‌చ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న వారిని లైవ్ పీడ్‌లో క‌నిపించడంతో వారంతా షాక్ కు గురయ్యారు. అకస్మాత్తుగా ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో బాధితురాలి కుటుంబం ఆందోళనకు గురైందని న్యాయవాదులు తెలిపారు. ఆమె బంధువులను సందర్శించినప్పుడు ఇలా వేడుకుంది: 'నన్ను విడిచిపెట్టవద్దు, వారు నన్ను బాధపెడతారు అంటూ చెప్పలేని విధంగా చెప్పిందని తెలిపారు.

భర్త మృతి, మాతో పడుకోవాలని గ్రామస్థుల లైంగిక వేధింపులు, పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం, ఒడిషాలో విషాద ఘటన

ప్రాసిక్యూట‌ర్లు ఫోరెన్సిక్ ఆధారాలు, కెమెరా ఫుటేజ్ ముందుంచ‌డంతో కోర్టు ఎదుట ఫిలిప్ త‌న నేరాన్ని అంగీక‌రించాడు. ఫిలిప్ ప‌ట్ల వృద్ధురాలు, ఆమె కుటుంబం పెంచుకున్న న‌మ్మ‌కాన్ని భ‌గ్నం చేశాడ‌ని, ఆమెను కంటికి రెప్ప‌లా కాపాడాల్సిన నిందితుడు ఇంత‌టి దారుణానికి తెగ‌బ‌డ్డాడ‌ని న్యాయ‌స్ధానం పేర్కొంది. కోర్టు వ్య‌వ‌హారాలకు స‌హ‌క‌రించిన బాధితురాలి కుటుంబ‌స‌భ్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. నిందితుడిని క‌ఠినంగా శిక్షించ‌డం వారికి కొంత ఊర‌ట ఇచ్చి ఉంటుంద‌ని న్యాయ‌మూర్తి పేర్క‌న్నారు.