Pak Ex- Minister Son Sentenced to Death, Image used for representation purpose only | Photo: PTI

Islamabad, DEC 29: తన ఔట్‌హౌస్ లో ముగ్గురు హిజ్రాలను (transgenders) కాల్చి చంపిన కేసులో పాకిస్థాన్ మాజీ మంత్రి కుమారుడికి సియాల్‌కోట్ (Sialkot) కోర్టు మరణశిక్ష విధించింది. పాకిస్థాన్ లోని పంజాబ్ లో మాజీ మంత్రి అజ్మల్ చీమా (Ajmal Cheema) కుమారుడు అహ్మద్ బిలాల్ చీమా (Ahmed Bilal Cheema) 2008 నవంబర్ 5న సియాల్‌కోట్ ప్రాంతంలోని తన ఔట్‌హౌస్‌లో మజర్ హుస్సేన్, అమీర్ షాజాద్,అబ్దుల్ జబ్బార్ లను కాల్చి చంపిన కేసులో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరిరి రూ. 5 లక్షల చొప్పున పరిహారంగా అందించాలని ఆదేశించింది. పాక్ లోని పంజాబ్ మాజీ మంత్రి అజ్మల్ చీమా కుమారుడు అహ్మద్ బిలాల్ చీమా 2008లో సియోల్‌కోట్‌లోని తన ఔట్ హౌస్ వద్ద ఓ డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీకి అతని స్నేహితులను పిలిచాడు. పార్టీలో ఎంటర్ టైన్ మెంట్ కోసం మజ్‌హర్ హుస్సేన్, ఆమిర్ షాజద్, అబ్దుల్ జబ్బార్ అనే ముగ్గురు హిజ్రాలను డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం పిలిచాడు. వారు డ్యాన్స్ చేస్తుండగా అహ్మద్ బిలాల్ స్నేహితులు వారితో అసభ్యంగా ప్రవర్తించారు.

Cambodia Fire: క్యాసినోలో చెలరేగిన మంటలు, 10 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు, ఇంకా లోపల పదుల సంఖ్యలో చిక్కుకున్న స్థానికులు, మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి హెలికాప్టర్లు 

దానికి సదరు హిజ్రాలు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో నేను పిలిచిన పార్టీకి వచ్చి నా స్నేహితులు చెప్పినట్లు చేయరా? అంటూ కోపంతో ఊగిపోయాడు. తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ ముగ్గురు హిజ్రాలు అక్కడిక్కడే చనిపోయారు.

Philippines Floods: ఫిలిప్పీన్స్‌‌ను ముంచెత్తిన భారీ వరదలు, 13 మంది మృతి, 23 మంది గల్లంతు, 45 వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులు  

ఈ ఘటన తరువాత అహ్మద్ బిలాల్ అమెరికా పారిపోయాడు. ఈక్రమంలో తిరిగి 2022 జులైలో అతని తిరిగి పాకిస్థాన్ రాగా పోలీసులు అతనిని ఎయిర్ పోర్టు వద్దే అరెస్ట్ చేశారు. కోర్టుకు అతనే దోషిగా నిర్ధారించే అన్ని సాక్ష్యాలను అదించారు. అలా ఈ కేసు విచారణ చేసిన ధర్మాసనం తాజాగా సియాల్‌కోట్ కోర్టు అమ్మద్ బిలాల్ కు మరణశిక్ష విధించింది. అలాగే బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది.