
అమెరికా సరిహద్దు( Mexico-US Border)లో మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిడెడ్ జారే(Ciudad Juarez) నగరంలోని శరణార్థి శిబిరం(Migrant Center)లో జరిగిన ప్రమాదంలో 39 మంది మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. మెక్సిన్ నగరంలోని నేషనల్ నేషనల్ మైగ్రేషన్ ఇనిస్టిట్యూట్(INM) సిబ్బంది అగ్నిప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఈ ఐఎన్‌ఎం శిబిరంలోని పార్కింగ్ స్థలంలో పదుల సంఖ్యలో మృతదేహాలను దుప్పట్లలో కప్పి ఉంచినట్లు సదరు వార్తా సంస్థ పేర్కొంది.
జపాన్ తీరంలో తీవ్ర భూకంపం, 6.1 తీవ్రతతో కంపించిన భూమి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
29 మందికి గాయాలైనట్లు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఈ శిబిరంలో 70 మంది శరణార్థులు ఉన్నట్లు, వారిలో అధికులు వెనిజువెలాకు చెందిన వారని తెలుస్తోంది. ఈ శిబిరం స్టాంటన్ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్‌కు దగ్గర్లో ఉంటుంది. ఇది సిడెడ్ జారే నగరాన్ని అమెరికాలోని టెక్సాస్‌తో కలుపుతుంది. ఈ ప్రాంతం మీదుగా వేలసంఖ్యలో వలసవెళ్తుంటారు.