French Catholic Church: చర్చిలో కామాంధులు, లక్షల మంది చిన్నారులను లైంగికంగా వేధించిన క్యాథ‌లిక్ చ‌ర్చి ఫాద‌ర్లు, ఫ్రాన్స్‌లో దారుణ ఘటన వెలుగులోకి, క్ష‌మాప‌ణ‌లు కోరిన ఫ్రెంచ్ చ‌ర్చి విభాగం
Image used for representational purpose | (Photo Credits: Getty Images)

Paris, Oct 5: ఫ్రాన్స్‌కు చెందిన క్యాథ‌లిక్ క్రైస్త‌వ ఫాదర్లు కొన్ని ద‌శాబ్ధాల నుంచి చిన్నారుల‌పై లైంగిక వేధింపుల‌కు (French clergy sexually abused) పాల్ప‌డ్డారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 1950 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్రాన్స్ క్యాథ‌లిక్ పాస్టర్లు సుమారు 216000 మంది చిన్నారుల‌ను వేధించిన‌ట్లు (French Church abuse) ఓ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. అయితే ఆ వేధింపుల సంఖ్య 3,30000 చేరుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా ఆ రిపోర్ట్‌లో వెల్ల‌డించారు. జీన్ మార్క్ సావే ఆ వేదిక‌కు హెడ్‌గా ఉన్నారు. ఆ రిపోర్ట్‌పై ఫ్రెంచ్ చ‌ర్చి షాక్ వ్య‌క్తం చేసింది. నివేదిక వెల్ల‌డించిన అంశాలు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయ‌ని, క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు ఫ్రెంచ్ చ‌ర్చి విభాగం కోరింది.

రోమ‌న్ క్యాథ‌లిక్ చ‌ర్చిల్లో చాలా దారుణ‌మైన రీతిలో లైంగిక వేధింపుల ఘ‌ట‌న‌లు (France Catholic church abuse scandal) జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే తాజా రిపోర్ట్ అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు అయ్యింది. 2018లో ఫ్రాన్స్ క్యాథ‌లిక్ చ‌ర్చి ఈ అంశంపై విచార‌ణ‌కు ఆదేశించింది. బయటకు వచ్చిన ఫ్రెంచ్ నివేదిక రొపోర్ట్ ప్రకారం.. గడిచిన 70 ఏళ్లలో ఫ్రాన్స్‌లోని కాథలిక్ చర్చిలో 3,30,000 మంది పిల్లలు లైంగిక వేధింపులకు (child sex abuse in French Catholic Church) గురయ్యారు. ఈ నివేదికను ఒక ఇండిపెండెంట్ కమిషన్ రూపొందించగా..కమిషన్ ప్రెసిడెంట్ జీన్-మార్క్ సావే దీనిని జారీ చేశారు. మొత్తం 2,500 పేజీల నివేదికను కమిషన్ ప్రిపేర్ చేసింది.

75 మందితో పెళ్లి.. మోజు తీరిన తరువాత వారిని సెక్స్ వర్కర్లుగా మార్చిన ఘరానా నేరస్థుడు, ఎట్టకేలకు ఇండోర్‌ సెక్స్‌ రాకెట్‌ సూత్రధారి మునీర్ ను పట్టుకున్న పోలీసులు

శాస్త్రీయ పరిశోధన, ప్రీస్ట్ ల దాడులు, ఇతర మతాధికారులతో పాటు చర్చిలో పాల్గొన్న మతేతర వ్యక్తుల లైంగిక వేధింపుల ఆధారంగా బాధితుల సంఖ్యను నివేదిక అంచనా వేసిందని కమిషన్ ప్రెసిడెంట్ జీన్-మార్క్ తెలిపారు. నివేదిక ప్రకారం, పిల్లలను లైంగికంగా వేధించిన వారిలో మూడింట రెండు వంతుల మంది ప్రీస్ట్ (priests)లే ఉన్నారు. వీరు గతంలో చర్చిలో పనిచేశారు. క్రైస్తవ మతాధికారులతో పాటు ఇతర మతాధికారులు దాదాపు 2,16,000 మందిని లైంగికంగా వేధించారని ఈ నివేదిక అంచనా వేసింది. వేధింపులకు గురైన బాధితులు ప్రస్తుతం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటున్నారని మార్క్ సావే విచారం వ్యక్తం చేశారు. బాధితుల్లో దాదాపు 60% మంది పురుషులు, మహిళలు వారి లైంగిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

2000 వరకు చర్చి అవలంభించిన తీరును అతను తిట్టి పోశారు. బాధితుల పట్ల ఎలాంటి సానుభూతి చూపించకుండా, వారి మాటలు నమ్మకుండా చర్చి నిర్వాహకులు, పోలీసులు తప్పు చేశారని మార్క్ సావే అసహనం వ్యక్తం చేశారు. ఇంకా సజీవంగా ఉన్న నేరస్తులపై 40కి పైగా కేసులు ఉన్నాయి. ఈ కేసులను చర్చి అధికారులకు ఫార్వర్డ్ చేస్తామని సావే తెలిపారు. మరో 22 కేసుల్లో బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

స్టార్‌ హోటల్‌లో నటులతో సెక్స్ వ్యాపారం, మహిళను అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు, కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో వృత్తిలోకి దిగినట్లు తెలిపిన మోడల్

ఈ నివేదికను తయారు చేయడానికి కమిషన్ రెండున్నర సంవత్సరాల పాటు పనిచేసింది. బాధితులు, సాక్షుల మాటలు, చర్చి, కోర్టు, పోలీస్, 1950 కాలం నుంచి వచ్చిన వార్తా కథనాల ఆధారంగా కమిషన్ దీనిపై డేటాని సేకరించింది. ఇందుకోసం ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నంబర్ కి బాధితులు లేదా బాధితురాలు, తెలిసిన వ్యక్తుల నుంచి దాదాపు 6,500కు పైగా కాల్స్ వచ్చాయి. ఈ లైంగిక దాడులను అరికట్టడానికి కమిషన్ 45 సిఫార్సులను జారీ చేసింది. ఇందులో క్రైస్తవ మతాధికారులకు, ఇతర మతాధికారులకు శిక్షణ ఇవ్వడం, చర్చిని పరిపాలించడానికి వాటికన్ ఉపయోగించే చట్టపరమైన కోడ్ కానన్ చట్టాన్ని సవరించడం వంటివి ఉన్నాయి. బాధితుల సంఘం 'పార్లర్ ఎట్ రివివ్రే' ( బహిరంగంగా మాట్లాడండి, మళ్లీ జీవించండి) అధిపతి అయిన ఒలివియర్ సావిగ్నాక్ ఈ ఫ్రెంచ్ నివేదిక విచారణకు సహాయపడ్డారు.

కాగా గత ఏడాది ప్రేనాట్ అనే ఒక ప్రీస్ట్ ని మైనర్లను లైంగికంగా వేధించిన కేసులో కోర్టు దోషిగా నిర్ధారించింది. విచారణలో అతడు 75 మంది అబ్బాయిలపై లైంగిక దాడి చేసినట్లు అంగీకరించాడు. దాంతో కోర్టు అతడికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇతడి బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. తాజా నివేదిక ఫ్రెంచ్ చర్చి వ్యవస్థను సమూలంగా మార్చేందుకు సహాయ పడుతుందన్నారు. బాధితులపై జరిగిన నేరాలను గుర్తించడమే కాదు వారికి పరిహారం కూడా చెల్లించాల్సిన బాధ్యత చర్చికి ఉందని అభిప్రాయపడ్డారు. ఇక చర్చిలో జరిగే లైంగిక వేధింపులను నివారించేందుకు పోప్ ఫ్రాన్సిస్ మే 2019 లో కొత్త చర్చి చట్టాన్ని జారీ చేశారు. ఈ చట్టం చర్చిలో ఉన్నత అధికారులు తప్పు చేస్తే.. వాటిని వెంటనే ఫిర్యాదు చేసే హక్కుని ఇతర మతాధికారులకు కల్పిస్తుంది.