Harsh Vardhan: డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా హర్ష్ వర్ధన్, డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎంపిక, ఈ నెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో బాధ్యతలు
Dr Harsh Vardhan | File Image | (Photo Credits: PTI)

New Delhi, May 20: ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ (WHO Executive Board Chairman) గా ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ (Dr Harsh Vardhan) బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 194 సభ్య దేశాలున్న డబ్ల్యూహెచ్ఓ (WHO) నిన్న సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎంపికైంది. ఆయుష్మాన్ భారత్ లబ్ది పొందినవారి సంఖ్య కోటికి పైగానే, అందరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ, త్వరలో ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులతో సంభాషణ

ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని (Dr Hiroki Nakatani) స్థానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెళ్లనున్నారు. హర్షవర్దన్ నియమాకాన్ని సభ్యదేశాలు కూడా అంగీకరించాయి. దీంతో ఈనెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలు చేపడతారు.

కాగా, ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌ అనేది పూర్తికాలం అసైన్‌మెంట్ కాదని, కేవలం బోర్డు సమావేశంలో మాత్రమే చైర్మన్ అందుబాటులో ఉండాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. బోర్డు సమావేశాలు సహజంగా ఏడాదిలో రెండుసార్లు జనవరి, మేలో జరుగుతుంటాయి. మూడేళ్ల స‌భ్య‌త్వం కోసం బోర్డు స‌భ్యుల‌ను ఎంపిక చేస్తారు. ఇటీవల 73 డబ్ల్యూహెచ్ఓ సమావేశాల్లోనూ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా హర్షవర్ధన్ మాట్లాడారు.  కేవలం 64 రోజుల్లోనే లక్ష కోవిడ్-19 కేసులు, అత్యధిక కేసులతో దడ పుట్టిస్తున్న దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఇండియాలో లక్షా ఆరువేలు దాటిన కరోనా కేసులు

ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి భారత్ తీసుకుంటున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోరనా వైరస్ పుట్టకకు సంబంధించి సంతంత్ర విచారణకు 100కు పైగా దేశాలు సమ్మతి తెలిపిన నేపథ్యంలో 34 మంది సభ్యుల డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు చైర్మన్‌గా డాక్టర్ హర్షవర్ధన్ ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.