Berlin, May 22: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను (Kamala Harries) తమ దేశంలోకి రాకుండా రష్యా (Russia) ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించింది. దీంతో రష్యా ప్రభుత్వం ద్వారం శాశ్వత నిషేదానికి గురైన అమెరికా పౌరుల సంఖ్య 963కి చేరింది. యుక్రెయిన్ (Ukraine) కు అమెరికా మద్దతు, రష్యా ఆక్రమణ తర్వాత విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా పలువురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం తాజా ఆంక్షల జాబితాను విడుదల చేసింది. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులు, రిపబ్లికన్స్, టెక్ ఎగ్జిక్యూటివ్స్, జర్నలిస్టులు, సాధారణ అమెరికా పౌరులు, మరణించిన(గతంలో బ్రతికి ఉన్నపుడు) మరికొందరు చట్టసభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా అమెరికా నేతలు, పౌరులు, ప్రముఖులపై రష్యా శాశ్వత నిషేధం విధించడం పై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం స్పందించింది.
Putin has banned me from Russia—a badge of honor from a barbaric butcher. My message back: America must expand military aid, humanitarian help, & crippling economic measures to assure brave, fierce Ukrainian fighters defeat you. https://t.co/6hhcLFiNHy
— Richard Blumenthal (@SenBlumenthal) May 21, 2022
“రష్యా ఘర్షణను కోరుకోదని..నిజాయితీగా, పరస్పర గౌరవంతో కూడిన చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంది. అధికారుల నుండి, రుస్సోఫోబియాను ప్రేరేపించే అమెరికన్ ప్రజలను మరియు దేశానికి సేవ చేసే వారి నుండి అమెరికా వేరు చేస్తుంది, ఈ వ్యక్తులు రష్యన్ ‘బ్లాక్ లిస్ట్’లో చేర్చబడ్డారు.” అని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
రష్యా నిషేదిత జాబితాలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, సెనేట్ మెజారిటీ నాయకుడు చార్లెస్ షుమర్ మరియు హౌస్ మైనారిటీ నాయకుడు కెవిన్ మెక్‌కార్తీతో సహా చాలా మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మాత్రం లేక పోవడం కొసమెరుపు. నటుడు మోర్గాన్ ఫ్రీమాన్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ మరియు మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా రష్యా నిషేదిత జాబితాలో ఉన్నారు.