Many Killed in Israeli Bombing on Gaza School (Photo Credits: X/@NourNaim88)

Gaza, June 6: గాజాలో మరో మారణ హోమం చోటు చేసుకుంది. నిరాశ్రయులైన పాలస్తీనియన్లతో నిండిన UN పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 35 మంది మరణించినట్లు సమాచారం.సెంట్ర‌ల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్‌పై ఈ దాడి జరిగింది. నుసేర‌త్ శ‌ర‌ణార్థి క్యాంపులో ఉన్న స్కూల్ టాప్ ఫ్లోర్‌పై ఇమ్రాయిల్ యుద్ధ విమానాలు రెండు మిస్సైళ్ల‌తో అటాక్ చేశాయి.

స్కూల్ కాంపౌండ్‌లో ఉన్న హ‌మాస్ కేంద్రంపై దాడి చేసిన‌ట్లు ఇజ్రాయిల్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ హీన‌మైన నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు హ‌మాస్ మీడియా పేర్కొన్న‌ది. దాడిలో గాయ‌ప‌డ్డ‌వారిని అంబులెన్సుల్లో రెస్క్యూ బృందాలు త‌ర‌లిస్తున్నాయి. క్లాస్‌రూమ్‌లు ధ్వంసం అయ్యాయి. మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డి ఉన్న వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.  పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించిన అమెరికా మిత్ర దేశాలు, రఫాలో అసలేం జరిగింది, అమాయకుల మృతిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్ర విచారం

నుసిరత్‌లో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ ఆధ్వర్యంలో నడిచే అల్‌-సర్దీ పాఠశాల భవనంపై క్షిపణులతో విరుచుకుపడింది. ప్రస్తుతం శరణార్థి శిబిరంగా ఉన్న ఇందులో పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ దాడిలో రెండో, మూడో అంతస్తులు ధ్వంసం కాగా.. దాదాపు 33 మంది మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమీపంలోని మరో ప్రాంతంపైనా జరిగిన దాడిలో ఆరుగురు మరణించారు.

Here's Videos

డెయిర్ అల్-బలాహ్ సమీపంలోని పట్టణంలోని అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి చనిపోయిన, గాయపడిన వ్యక్తులను తరలించారు. గతవారం రఫాలో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ కేంద్రం సమీపంలో జరిగిన దాడిలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికా సహా ప్రపంచదేశాలు దీన్ని ఖండించాయి.