Beijing, FEB 22: చైనా వెల్ఫేర్ లాటరీలో ఓ యువ వ్యాపారి (28) దేశంలోనే అత్యధిక బహుమతిని (Jackpot) సొంతం చేసుకున్నారు. గుయిఝౌ ప్రావిన్స్‌కు చెందిన ఈ చిరు వ్యాపారి లాటరీలో (China Lottery) రూ.795.84 కోట్లు గెలుచుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. ఆయన 133 టికెట్లను కొన్నారని, ప్రతిసారీ ఒకే గ్రూపునకు చెందిన ఏడు నంబర్లపై పందెం కాసేవారని, ప్రతి టికెట్‌కు దాదాపు రూ.6 కోట్ల చొప్పున బహుమతి వచ్చిందని తెలిపారు. విజేత వివరాలను ఈ సంస్థ బయటపెట్టలేదు.
గుర్తు తెలియని ఆ విజేత ఈ నెల 7న బహుమతిని స్వీకరించేందుకు వచ్చారని తెలిపింది. విజేత స్పందిస్తూ, ఉద్వేగభరితుడినయ్యానని, నిద్ర పట్టలేదని చెప్పారు. బహుమతిలో ఐదో వంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.